గుంటూరు కారం.. నిజంగా బడ్జెట్‌ ఇష్యూ కాదు భయ్యా!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం( Guntur Karam ).

ఈ సినిమా యొక్క షూటింగ్‌ కార్యక్రమాలు సగానికి పైగా పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తొలగించారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలు నిజమే అంటూ ఇప్పటికే పలువురు యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.పూజా హెగ్డే భారీ గా పారితోషికం డిమాండ్ చేయడం వల్లే ఆమెను బడ్జెట్‌ ఇష్యూ కారణంగా తప్పించారు అంటూ వార్తలు వస్తున్నాయి.

కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదు అన్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాకు బడ్జెట్‌ ఇష్యూ ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

"""/"/ కావాలి అనుకుంటే బాలీవుడ్‌ నుండి కూడా స్టార్‌ హీరోయిన్స్ ను తీసుకు రాగల సత్తా ఉంది.

హాసిని అండ్ హారిక బ్యానర్‌( Hasini And Harika Banner ) లో రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్‌ ఇష్యూ లేనే లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి హీరోయిన్ ను కొన్ని ఇతర కారణాల వల్ల తొలగించి ఉంటారే తప్ప ఆమెను బడ్జెట్‌ ఇష్యూ కారణంగా తొలగించి ఉండరు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే( Pooja Hegde ) తనకు డేట్లు ఇబ్బంది అవ్వడం వల్ల గుంటూరు కారం సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించింది.

"""/"/ కానీ ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని దృవీకరించలేదు.

శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్ గా కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు హీరోయిన్‌ గా ఆమె గుంటూరు కారంలో కనిపించబోతుంది.మరో వైపు మీనాక్షి చౌదరి అనే కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

నాకు రాజకీయాలు తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే.. పూనమ్ కామెంట్స్ వైరల్!