రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
TeluguStop.com
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది.సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా కల్వర్టు గుంతలో ఓ వాహనం పడి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఆయన అప్పటికే మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు.గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలం ఉద్దండ్రయుని పాలెంలో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఉద్దండ్రాయుని పాలెం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీద విజయవాడకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఏలూరుకు చెందిన మానవ శంకర్ రావు (60) తన భార్య స్వగ్రామమైన ఉద్దండ్రాయుని పాలెంకు వచ్చి వెళ్తున్న క్రమంలో కారు ప్రమాదానికి గురైంది.
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా తాళ్లాయపాలెం జంక్షన్ వద్ద కల్వర్టు నిర్మాణం కోసం రోడ్డును తవ్వి వదిలేశారు అధికారులు.
వర్షకాలం కావడంతో గుంత నీటితో నిండిపోయింది.ఈ విషయం తెలియని మానవ శంకర్ రావు కారు వేగంగా నడుపుతూ కల్వర్టు గుంతలో పడ్డారు.
తీవ్ర గాయలై రక్తస్రావం ఏర్పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..