మొన్న బెజవాడ కుర్రాడు.. నేడు గుంటూరు టెక్కీ, అమెరికాలో మరో తెలుగు వ్యక్తి మృతి
TeluguStop.com
అమెరికాలో విహారయాత్ర కోసం వెళ్తున్న తెలుగువారు అనుకోని ప్రమాదాల బారినపడుతూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.
నిన్న గాక మొన్న విజయవాడకు చెందిన ఓ కుర్రాడు విహారయాత్ర కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ కాలుజారి జలపాతంలో పడి మృతిచెందాడు.
ఈ ఘటన మరిచిపోకముందే మరో తెలుగు టెక్కీ ట్రెక్కింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్‌కు.
నగరానికే చెందిన టీడీపీ నేత సుఖవాసి శ్రీనివాసరావు - రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరిద్దరూ అమెరికాలోని ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.అంతకుముందే శ్రీనాథ్ అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేశాడు.
అనంతరం మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశాడు.ఆదివారం సెలవుదినం కావడంతో ఆయన తన స్నేహితులతో కలిసి క్లీవ్‌లెన్స్ మౌంటెన్‌హిల్స్‌కు ట్రెక్కింగ్ నిమిత్తం వెళ్లారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ 200 అడుగుల ఎత్తు నుంచి శ్రీనాథ్ జారిపడ్డారు.ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అతని మరణవార్తను భార్య సాయిచరణి భారత్‌లోని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.అమెరికాలో ఉద్యోగం చేస్తూ.
ఉన్నత హోదాలో వున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియగానే శ్రీనాథ్ తల్లిదండ్రులు.
బాబూరావు, మల్లేశ్వరిలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. """/"/
మరోవైపు అతని భౌతికకాయాన్ని గుంటూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి భారతదేశానికి చేరుకునేసరికి వారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
శ్రీనాథ్ మరణవార్తతో గుంటూరులోని అతని బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.అటు అల్లుడి మృతితో తీవ్ర విషాదంలో వున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావును పలు పార్టీల నేతలు పరామర్శించి, ఓదార్చారు.
‘పుష్ప 2’ అనుకున్న విజయాన్ని సాధిస్తుందా..? లేకపోతే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి..?