గుంటూరు కారం కేరళ షూట్ క్యాన్సిల్.. కారణం ఇదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ).

మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా చూస్తున్నారుఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ లేకుండా శరవేగంగా షూట్ జరుపు కుంటున్న విషయం తెలిసిందే.

ఈ నెలలోనే షూట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ పూర్తి చేయాలి.ఎందుకంటే వచ్చే నెలలోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవ్వబోతుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గుంటూరు కారం రిలీజ్ చేయనున్నారు.

"""/" / ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక సాంగ్ షూట్ కోసం కేరళ వెళ్లాలని అక్కడే మహేష్, శ్రీలీలపై మూడవ సాంగ్ షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.

కానీ అక్కడ పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవకపోయావడంతో ఈ షూట్ ను క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే సాంగ్ షూట్ ను రేపటి నుండి షురూ చేయనున్నట్టు తెలుస్తుంది.

"""/" / కాగా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( Sreeleela Meenakshi Chaudhary ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. వెంకీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా?