దసరా కానుకగా ‘గుంటూరు కారం’ నుండి స్పెషల్ పోస్టర్?
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంతటా హోప్స్ పెరిగి పోయాయి.
మహేష్ బాబు హీరోగా శ్రీలీల( SreeLeela ) మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
"""/" /
సంక్రాంతి రిలీజ్ ఉండడంతో ఎలాంటి గ్యాప్ లేకుండా షూట్ పూర్తి చేస్తున్నారు.
ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
జగపతిబాబు( Jagapathi Babu )ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
"""/" /
ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రాగా అలాగే కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసారు.
అయితే ఈ సినిమా నుండి మొదటి సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కానీ ఈ ఫస్ట్ సింగిల్ పై ఎలాంటి అప్డేట్ లేదు.దసరా పండుగకు అయినా కనీసం దీని గురించిన అప్డేట్ ఇస్తారేమో అని ఎదురు చూసారు.
మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పండుగకు స్పెషల్ అప్డేట్ ను అయితే మేకర్స్ ఇవ్వబోతున్నారు అనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రాబోతుంది అనేది మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా రివీల్ చేస్తారని తెలుస్తుంది.
ఈ పోస్టర్ లో మహేష్ ఫుల్ మాస్ లుక్ లో ఉండనున్నారట.ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ రెండవ వారం వరకు పూర్తి చేస్తారని షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో వైపు సాగుతున్నాయి.
శంకర్ ఇక రిటైర్మెంట్ అవ్వడం బెటరా..?