గుంటూరు కారం క్లైమాక్స్ కు మహేష్ రెడీ.. షూట్ అప్డేట్స్ ఇవే!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''( Guntur Karam ).

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని మొదట్లో ఫ్యాన్స్ నుండి కూడా చాలా అనుమానాలు వచ్చాయి.

అయితే ఈ అనుమానాలకు మేకర్స్ చెక్ పెట్టారు.మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చిన అనుకున్న డేట్ కు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ చాలానే కష్టపడ్డారు.

ఇక తాజాగా ఈ షూట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.గుంటూరు కారం షూట్ ఫైనల్ కు చేరుకున్నట్టు టాక్.

"""/" / తాజాగా మేకర్స్ క్లైమాక్స్ ను షూట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

దాదాపు 5 కోట్ల రూపాయల భారీ సెట్ లో గుంటూరు కారం క్లైమాక్స్ ను తెరకెక్కిస్తున్నారట.

మహేష్ కోసం పీటర్ హెయిన్ విభిన్నమైన యాక్షన్ బ్లాక్ ను కూడా సిద్ధం చేసారని ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుందని అంటున్నారు.

"""/" / కాగా పాన్ ఇండియా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెట్టారని టాక్.

అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ బిజినెస్( Guntur Karam Pre Business ) కూడా భారీగా జరుగుతుంది.

మహేష్, త్రివిక్రమ్( Trivikram Srinivas ) వల్ల ఈ సినిమాకు అదే రేంజ్ లో క్రేజ్ రాగ బిజినెస్ స్థాయి కూడా పెరిగింది.

మరి ఈ సూపర్ హిట్ కాంబో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు( Jagapathi Babu ) విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.