గుంటూరు కారం.. మరో షెడ్యూల్ ఫినిష్.. కొత్త షెడ్యూల్ స్టార్ట్!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''గుంటూరు కారం''.
( Guntur Karam ) ఈ సినిమా జనవరిలో స్టార్ట్ అవ్వగా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని సమ్మర్ ముందు వాయిదా పడిన విషయం తెలిసిందే.
మరి అప్పుడు ఆగిపోయిన ఈ సినిమా గత కొన్ని రోజులే క్రితమే లాంగ్ గ్యాప్ తర్వాత షూట్ స్టార్ట్ చేసుకుంది.
"""/" /
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
మరి ఇప్పటికే ఈ ఏడాది సగం పూర్తి అయ్యింది.దీంతో అనుకున్న సమయానికి షూట్ పూర్తి అవుతుందో లేదో అనే ఆందోళన ఫ్యాన్స్ లో ఉంది.
అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేయడానికి మేకర్స్ ఫుల్ ప్లాన్ తో రెడీ అయినట్టు అనిపిస్తుంది.
మరి ఈ క్రమంలోనే రీసెంట్ గానే స్టార్ట్ చేసిన కొత్త షెడ్యూల్ పూర్తి అయినట్టు టాక్.
ఈ షెడ్యూల్ ను అనుకున్న సమయం కంటే ముందుగానే ఫినిష్ చేశారట. """/" /
అలాగే నెక్స్ట్ షెడ్యూల్ పై కూడా సమాచారం అందుతుంది.
ఈ రోజు నుండి మరో కొత్త లొకేషన్ లో షూట్ స్టార్ట్ చేయనున్నట్టు టాక్.
మరి ఈ షెడ్యూల్ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా వరుసగా 20 రోజుల పాటు చేయనున్నారని తెలుస్తుంది.
ఇలాగె షూట్ కు గ్యాప్ లేకుండా చేస్తే మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికే పూర్తి చేయవచ్చు.
చూడాలి మరి మహేష్, త్రివిక్రమ్ ఏం చేస్తారో.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి2, ఆదివారం 2025