విశ్వరూపం చూపించిన థమన్..’గుంటూరు కారం’ మొదటి సాంగ్ ప్రోమో కి అదిరిపోయిన రెస్పాన్స్!
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం( Guntur Kaaram )' చిత్రం పై అభిమానులు ఏ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అతడు మరియు ఖలేజా వంటి ఆల్ టైం క్లాసిక్ సినిమాలు తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది.
అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ షూటింగ్ దశలో ఉన్నపుడే ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.
సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బయ్యర్స్ పాలిట బంగారు బాతు లాగ భావిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు టీజర్ తప్ప, ఈ చిత్రం నుండి వచ్చిన ఏ కంటెంట్ కూడా అభిమానులను థ్రిల్ కి గురి చెయ్యలేదు.
కేవలం ఒకే రకమైన పోస్టర్స్ తో ఫ్యాన్స్ కి మెంటల్ రప్పించారు.దానికి తోడు థమన్( Thaman ) ఈమధ్య మహేష్ మూవీస్ అన్నిటికీ యావరేజ్ మ్యూజిక్ ని అందించాడు.
"""/" /
ఆయన ఈ ప్రిస్టీజియస్ చిత్రానికి ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో అని అభిమానులు భయపడుతూ వచ్చారు.
ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో కాంబినేషన్ తో పాటుగా అద్భుతమైన మ్యూజిక్ ఉండడం కూడా తప్పనిసరి.
అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తుంటాయి.
రీసెంట్ గా విడుదలైన 'లియో' చిత్రం అందుకు ఒక ఉదాహరణ.అందుకే మహేష్ ఫ్యాన్స్ 'గుంటూరు కారం' చిత్రం నుండి కనీసం ఒక్క బ్లాక్ బస్టర్ సాంగ్ ఉండాలని కోరుకున్నారు.
వారి అంచనాలకు తగ్గట్టుగానే థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.నవంబర్ 7 వ తారీఖున 'గుంటూరు కారం' చిత్రానికి సంబంధించి 'దమ్ మసాలా బిర్యానీ' అనే లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యబోతున్నారు.
ఆరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) పుట్టినరోజు కాబట్టి ఈ లిరికల్ వీడియో సాంగ్ ని వదులుతున్నారు.
దీనికి సంబంధించిన చిన్న ప్రోమో ని నేడే విడుదల చేసారు. """/" /
ఈ ప్రోమో సాంగ్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంది.
ఇది వరకు థమన్ అందించిన బాణీల కంటే బిన్నంగా ఈ లిరికల్ వీడియో సాంగ్ ఉండడం విశేషం.
సాధారణంగా ఒక కొత్త పాట మొదటిసారి విన్నప్పుడు మనకి వెంటనే నచ్చదు.రెండు మూడు సార్లు వింటే కానీ బుర్రకి ఎక్కదు, కానీ ఈ మాట మొదటిసారి విన్నప్పుడే అద్భుతంగా అనిపించింది.
ఇక ఈ సాంగ్ లో మహేష్ ఊర మాస్ లుక్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఇన్ని రోజులు ఎలాంటి మహేష్ బాబు ని చూడాలని కోరుకున్నామో, అలాంటి మహేష్ బాబు ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. షెడ్యూల్ ఇలా