గత ఐదు సినిమాలలో నాలుగు సినిమాలు డిజాస్టర్లే.. గుణశేఖర్ గుడ్ బై చెబుతారా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న దర్శకుల పేర్లలో గుణశేఖర్ కూడా ఒకటి.
శాకుంతలం సినిమా ఫుల్ రన్ లో కేవలం 4 కోట్ల రూపాయల కలెక్షన్లను మాత్రమే సాధించిన నేపథ్యంలో గుణశేఖర్ పేరు వినిపిస్తుండటం గమనార్హం.
ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సినిమా ఇంత దారుణంగా కలెక్షన్లను సాధించడం శాకుంతలం సినిమా విషయంలోనే జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
"""/" /
అయితే ఈ దర్శకుడి ట్రాక్ రికార్డ్ మాత్రం దారుణంగా ఉంది.
సైనికుడు( Sainikudu ), వరుడు, నిప్పు, శాకుంతలం సినిమాలను కళాఖండాలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రుద్రమదేవి సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా సక్సెస్ కు బన్నీ, అనుష్క కారణమని చాలామంది భావిస్తారు.
రుద్రమదేవి( Rudrama Devi ) సినిమా కూడా రిలీజ్ కు ముందు, తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
"""/" /
గుణశేఖర్ దర్శకత్వానికి గుడ్ బై చెప్పాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి కళాఖండాల వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది చెబుతున్నారు.
అనవసరమైన సెట్స్ తో గుణశేఖర్ బయ్యర్లను ముంచుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రేక్షకుల టేస్ట్ ను పట్టించుకోకుండా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తే లాభం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
"""/" /
ఇతర డైరెక్టర్లను చూసి గుణశేఖర్ చాలా విషయాలను నేర్చుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
గుణశేఖర్( Gunasekhar ) సినిమాలకు గుడ్ బై చెబుతారో లేక మరో ప్రాజెక్ట్ తో ముందుకొస్తారో చూడాలి.
లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్న దర్శకనిర్మాతలు సైతం బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.
లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లు హీరోయిన్ల మార్కెట్ ను సైతం నాశనం చేస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
హీరోయిన్లు సైతం ఈ తరహా ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది.
2025 లో మెగా హీరోలు తమ సత్తా చాటబోతున్నారా..?