వీడియో: తలపై గన్ను పెట్టి షూట్ చేద్దామనుకున్న మర్డరర్‌.. కానీ పనిచేయని తుపాకీ.. చివరికి..

కొన్నిసార్లు అదృష్టం బాగోలేకపోతే చిన్న ప్రమాదాలలోనే ప్రాణాలు పోతాయి.మరి కొన్నిసార్లు పెద్ద ప్రమాదాల్లో ఉన్న బతికే బయట పడుతుంటారు కొందరు.

అలాంటి లక్కీ పీపుల్‌కి( Lucky People ) సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఆ కోవకు చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే ఇద్దరు వ్యక్తులు ఒక చోట నిలబడి మాట్లాడుతుండటం చూడవచ్చు.

బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న యువకుడు రెడ్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు.

కొద్దిసేపటికి బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.రెడ్ టీ-షర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడే నిల్చోని ఫోన్‌లో ముచ్చట్లు పెడుతున్నాడు.

వీడియోలో అతను ఒక షాప్ షెల్టర్ ముందు నిల్చోని ఉన్నట్లు కనిపించింది.ఇంతలోనైనా మరొక వ్యక్తి చేతిలో తుపాకీ పట్టుకొని( Gun ) అక్కడికి వచ్చాడు.

ఆ పిస్తోల్‌న రెడ్ టీ షర్టు వేసుకున్న వ్యక్తి తల వెనుక భాగంపై గురిపెట్టి కాల్చాడు.

ఆపై ట్రిగ్గర్ నొక్కాడు, కానీ పేలలేదు.మరొకసారి ట్రై చేశాడు.

అయినా ఆ తుపాకీ పని చేయలేదు. """/" / అది వర్క్ కావట్లేదని అతను గ్రహించాడు, ఎవరైనా చూసి పట్టుకుంటే దేహశుద్ధి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

తన వెనకే ఒక వ్యక్తి తుపాకీ పట్టుకొని పేల్చడానికి ట్రై చేస్తున్నాడన్న విషయాన్ని రెడ్ టీషర్ట్ వ్యక్తి( Red T-Shirt Man ) గమనించలేకపోయాడు.

కానీ అక్కడే ఉన్న కొందరు ఈ విషయాన్ని గ్రహించి ఎవరో తుపాకీతో కాల్చడానికి ట్రై చేస్తున్నాడని గట్టిగా అరిచారు.

దాంతో అలర్ట్ అయిన సదరు వ్యక్తి కొంచెం దూరంగా పారిపోయాడు.తనపై ఎవరా అటాక్( Attack ) చేసేది అని అటు ఇటు చూసాడు కానీ అప్పటికే మర్డరర్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

ఇదంతా సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. """/" / ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

ఈ ఘటన ఆఫ్రికాలో( Africa ) చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు "రెండుసార్లు గన్ జామ్ ( Gun Jammed ) అయ్యింది అనుకుంటా, లేకపోతే అతడు ఇప్పటికే మరణించి ఉండేవాడు" అని కామెంట్లు చేశారు.

అదృష్టమంటే ఇదే, ఆ గన్ పని చేసి ఉంటే పరిస్థితి ఏమైయ్యదో అని ఇంకొందరు కామెంట్లు చేశారు.

మొదటగా ఈ వ్యక్తితో మాట్లాడిన యువకుడే ఈ సెట్ అప్ చేసి ఉంటాడు అని మరికొందరు ఆరోపించారు.

ఎమ్మెల్యే Vs మాజీ ఎంపీ… రాజమండ్రిలో ప్రమాణాల సవాల్ !