అపోలో ఆసుపత్రిలో గుమ్మడి చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా ?
TeluguStop.com
గుమ్మడి.టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటన పరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నటులలో గుమ్మడి కూడా ఒకరు.
గుమ్మడి పూర్తి గుమ్మడి వెంకటేశ్వర రావు.తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలి వస్తున్న క్రమంలో సీనియర్ హీరోలయిన అక్కినేని, ఎన్టీఆర్ ల తో పాటు 1992 లో గుమ్మడి కూడా వచ్చేసారు.
కానీ అయన హైదరాబాద్ కి వచ్చిన తర్వాత చాల కొద్దీ రోజులకే అనారోగ్యం పాలయ్యారు.
కానీ ఒక సర్జరీ తర్వాత అయన కోలుకొని ప్రాణాపాయం నుంచి గట్టెక్కారు.ఆ తర్వాత మరో రెండేళ్లకు అంటే 1995 లో పక్షవాతం భారిన పడి చాలా ఇబ్బంది పడ్డారు.
పక్షవాతం తర్వాత ఆయన గొంతు కూడా పని చేయలేదు.ఎంతో గంభీరమైన గొంతు కలిగి ప్రత్యేకమైన వాచకానికి పెట్టింది పేరు అయిన గుమ్మడి మాట్లాడటానికి సైతం చాల కష్టపడ్డారు.
తాను నటించగలిగిన కూడా తన పాత్రకు మరొక వ్యక్తి తో డబ్బింగ్ చేయించడం ఇష్టం లేక సినిమాలు మానేయ్యాలనుకున్నారు.
అయిన కూడా తప్పని సరి సిచుయేషన్ లలో ఒక 2 లేదా మూడు సినిమాల్లో నటించారు.
కానీ అయన గొంతు లో వేరొకరి మాటలు వినిపించే సరికి అభిమానులు యాక్సెప్ట్ చేయలేదు.
దాంతో గుమ్మడి కూడా ఎంతో ఇబ్బంది ఫీల్ అయ్యారు.ఆ తర్వాత సినిమాలు పూర్తిగా మానేశారు.
"""/"/
ఆ తరువాత రోజుల్లో అంజలి దేవి స్వీయ నిర్మాణంలో వచ్చిన సినిమా పుట్టపర్తి సాయి బాబా.
ఈ చిత్రంలో అతి కష్టంగా ఒక ముసలి వ్యక్తి పాత్రలో గుమ్మడి నటించారు.
స్వయంగా బాబా గుమ్మడితో నటించాలని కోరారని, అలాగే అయన గొంతు కు ఎదో ఒక మందు రాస్తే డబ్బింగ్ కూడా చెప్పారని అంటూ ఉంటారు ఆ తర్వాత 2008 లో కాశి నాయన సినిమాలో కూడా గొంతు సహకరించడం తో మరోసారి నటించారు.
ఇక అయన ఆరోగ్యం బాగా లేకపోయినా మాయ బజార్ కలర్ లో తీయగా తన స్నేహితులతో కలిసి ఆ సినిమా చూసి ఎంతో సంతోష పడ్డారు.
ఇక ఆ తర్వాత ఒక వారం రోజులకు గుమ్మడి కి మళ్లి ఆరోగ్యం పాడటం తో అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసారు.
అయన గుండె చాల బలహీనంగా ఉందని, బీపీ కూడా పడిపోవడం తో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి ఆ తర్వాత కన్ను మూసారు.
బాలయ్య చేస్తున్న డాకు మహారాజ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్న బాబీ…