కేవలం గడ్డాలు, విగ్గు ల కోసం బడ్జెట్ మొత్తం పెట్టిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా పరిశ్రమ తొలినాళ్లలో ఎక్కువగా పౌరాణిక, జానపద చిత్రలు తెరకెక్కేవి.రామాయణం, మహాభారతం, భాగవంతం లాంటి సినిమాలు తెరకెక్కించేందుకు ఇష్టపడ్డారు దర్శక నిర్మాతలు.

ఆ సమయంలో ప్రజలకు కూడా ఆ సినిమాలను చూసేందుకే ఎక్కువ ఆసక్తి కనబర్చే వాళ్లు.

అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగా ఇదే తరహా సినిమాలు తీసేవారు.చాలా కాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమ పౌరాణిక, జానపద సినిమాలతో ముందుకు సాగింది.

అయితే పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల్లో మనుషులతో పాటు రుషుల పాత్రలు ఎక్కువగా కనిపించేవి.

అలాగే రాక్షసులు, మాంత్రికులు కనిపించే వారు.వీరందరికీ గడ్డాలు, మీసాలు పెద్ద పెద్దగా ఉండేవి.

అందుకే సినిమాల్లో ఈ పాత్రలు పోషించే వారికి తప్పకుండా గడ్డాలు, మీసాలు అతికించేవారు.

ఒక్క నారదుడు మినహా మిగతా వారందరికీ గడ్డాలు, మీసాలు పెట్టేవారు.ఈ పాత్రలకు ప్రత్యేకంగా విగ్గులు, గడ్డాలు, మీసాలు తయారు చేసి అతికించేవారు.

అయితే గడ్డాలు, మీసాలు పెద్దగా ఉన్న పాత్రలను ప్రముఖ నటుడు నాగయ్య ఎక్కువగా పోషించేవాడు.

ఈ విషయాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావు చెప్పాడు.మునుల పాత్రలు వీరిద్దరే ఎక్కువగా చేసేవారు.

గడ్డం, మీసాలు అతికించేందుకు మాక్స్‌ ఫాక్ట‌ర్ వారి గ‌మ్ ఎక్కువగా వాడేవారు. """/"/ ఈ గమ్ వాడి గడ్డాలు, మీసాలు అతికిస్తే.

ఎక్కువగా నిలబడేవి.తాము సినిమా పరిశ్రమలో ఎక్కువగా ఈ గమ్ వావినట్లు చెప్పారు.

అందుకే మాక్స్‌ ఫాస్ట‌ర్ కంపెనీ తమకు సన్మానం చేయాలని చెప్పారు.ఈ సన్మానం గురించి కంపెనీ వారికి లేఖ కూడా రాసినట్లు వెలడించారు.

సెట్స్ లో గమ్మడి ఈ కామెంట్స్ చేయడంతో నవ్వుల పువ్వులు పూశాయి.అయితే జగ్గయ్యకు గడ్డాలు, మీసాలు పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదట.

వెంటనే తనకు ఎలర్జీ వచ్చేదట.అయితే.

ఆయన ఈ పాత్రలు చేయడంలో ఘనాపాటి కావడంతో నిర్మాతలు, దర్శకులు తన చేత ఈ పాత్రలు వేయించేవారట.

అయితే గమ్ వాడకం తగ్గిన తర్వాత ఆయన ఈపాత్రలు చేసేందుకు ఓకే చెప్పాడట.

Kattedan Fire Accident : రాజేంద్రనగర్ కాటేదాన్ లో అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంటలు