గుల్తాజీ దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.. ఏ రాష్ట్రంలో ఉందంటే..
TeluguStop.com
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు పది కిలోమీటర్ల దూరంలో గుల్తాజీ దేవాలయం ఉంది.
15వ శతాబ్దంలో దివాన్ రావు కృపారావు ఆధ్వర్యంలో దీనిని రాజా సవాయి జై సింగ్నిర్మించడం జరిగింది.
ఈ దేవాలయం 16వ శతాబ్దం నుంచి ధ్యాన యోగులకు ముఖ్యమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెంది ఉంది.
వంద సంవత్సరాలు ఇక్కడే నివసించి తపస్సు చేసిన సాధువు గలవ్ పేరు మీద ఈ దేవాలయానికి ఆ పేరును పెట్టారు.
చరిత్రకా కట్టడంగా పేరుగాంచిన గుల్తాజీ దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.
గుల్తాజీ మత విశ్వాసానికి ప్రతికగా స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఈ దేవాలయ పరిసర ప్రాంతం ప్రశాంతతకు మారుపేరుగా భావిస్తూ ఉన్నారు.
ఇక్కడ గాలవు అనే ముని చాలా సంవత్సరాలు తపస్సు చేశాడని అందుకే ఇక్కడ ఈ ప్రధాన దేవాలయాన్ని గాల్తాజీ ఆలయం అని పిలుస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఈ దేవాలయ ప్రాంగణంలోనే బాలాజీ మరియు సూర్యదేవుని దేవాలయాలు కూడా ఉన్నాయి.
పూర్తిగా రాతితో నిర్మితమైన ఈ దేవాలయాలు భక్తులకు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.గల్తాజీ లోని దేవాలయాలు గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించబడి ఉన్నాయి.
దేవాలయ సముదాయం చాలా అందంగా నిర్మించబడి ఉంది.రంగు రంగుల పెయింటింగ్ లతో నిండిన డిజైన్ కారిడార్లను కలిగి ఉంది.
ఈ దేవాలయం అప్పటి శిల్పకళా చతుర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భావించవచ్చు.ఈ ప్రాణంగాన్ని ఒక అద్భుతస్థలిగా కొంతమంది మేధావులు అభివర్ణిస్తారు.
పండగల సమయాలలో దేవాలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.జైపూర్ నగరానికి దగ్గరలో నిర్మించిన ఈ దేవాలయం మకర సంక్రాంతి సందర్భంగా పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది.
కుటుంబ సమేతంగా వచ్చేవారు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. """/"/
ఆరావళి పర్వతం గుండ ప్రవహించే జలపాతం దేవాలయానికి సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైనది.
ఈ బుగ్గలోని నీరు చుట్టుపక్కల అనేక చెరువులలోకి ప్రవహిస్తుంది.దేవాలయ ప్రాంగణంలో ఏడు సహజ నీటి వనరులు కూడా ఉన్నాయి.
ఇక్కడ సందర్శకులు ఎక్కువగా స్థానాలు చేస్తూ ఉంటారు.
ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ సపోర్ట్ చెయ్యరు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!