గల్ఫ్ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా : హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆధ్వర్యంలో నిర్వహించిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై గల్ఫ్‌ కార్మిక సంఘనాయకుల సమావేశంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ( Adi Srinivas ) పాల్గొన్నారు… వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమర్థం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.గత ఎన్నికల సమయంలో గడపగడప ఇంటికి ప్రచారం వెళ్ళినప్పుడు ప్రతి గల్ఫ్ కార్మికుడి కుటుంబ సభ్యులు నాకు అండగా నిలుచొని నా గెలుపులో భాగస్వామ్యం అయ్యారని వారికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

గల్ఫ్ కి వెళ్ళిన ప్రతి కార్మికుడు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటామని కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఏదైనా జరిగితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం( Congress Government ) గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లక్ష రూపాయలు ఇచ్చిందని మళ్లీ 10 సంవత్సరాల తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు లక్షలు పరిహారం అందిస్తుందన్నారు.

గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో గల్ఫ్ కార్మికులను( Gulf Workers ) వారి సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

వారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్లు ఇస్తాం అని చెప్పి మోసం చేసారని అన్నారు.

గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో శంషాబాద్ రాజీవ్ విమానాశ్రయం వారి లెక్కల ప్రకారం సుమారు 2000 వరకు పార్థివ దేహాలు గల్ఫ్ దేశాల నుండి వచ్చాయని, వారి కుటుంబ సభ్యులును ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు.

ఎన్నికల అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో సబ్ కమిటీ చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గల్ఫ్ లో మరణించిన కార్మికులకు ఐదు లక్షల పరిహారం అందజేస్తామని చెప్పామని, అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి చెక్కును రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో మరిపెళ్లి, బావుసాయిపేట గ్రామాల్లో చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశామని గుర్తు చేశారు…తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యుల పిల్లలకు గురుకులాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని కోరారు.

రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కేరళ తరహా పాలసీ తీసుకువచ్చేందుకు పరిశీలిస్తున్నామని,తెలంగాణ వర్క్స్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఒక్క వారం ట్రైనింగ్ తీసుకున్నాడు.. సంవత్సరానికి రూ.66 లక్షలు ప్యాకేజీ కొట్టేశాడు..?