చేతిలో ఫోన్ ఉంది కదా అని అక్కడ సెల్ఫీలు దిగారో.. ఇక అంతే!
TeluguStop.com
మన చేతిలో నిత్యం ఉండే స్మార్ట్ ఫోన్‌తో ఎక్కడైన టూరీస్టు ప్రాంతాలకు వెళ్లినప్పుడు క్లిక్ అనిపిస్తాం.
ఏ సుందరమైన దృశ్యం కనిపించినా.మన ఫోన్‌లో బంధించేస్తాం.
అయితే, అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యపడుతుంది కానీ, ఒక ప్రాంతంలో ఇక మనం సెల్ఫీలు దిగడానికి ఛాన్స్ ఉండదట.
ఎందుకంటే అక్కడి ప్రభుత్వం సెల్ఫీలను నిషేధించింది.దీంతో ఎవరైనా ఆ ప్రాంతంలో ఫోటో తీసుకుంటే చట్టపరంగా నేరం అవుతుంది.
అది ఎక్కడో ఆ వివరాలు తెలుసుకుందాం.ఆ ప్రాంతం గుజరాత్‌లోని దాంగ్.
ఈ జిల్లాల్లో జూన్ 23 నుంచి అక్కడ అధికారులు ఆ జిల్లా పర్యాటక ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించినట్టు అధికారిక ప్రకటన జారీ చేశారు.
టూరీస్టులే కాకుండా స్థానికులు కూడా అక్కడి నదుల్లో స్నానం, బట్టలు ఉతకడం వంటివి చేయకూడదు.
దీనికి ఓ ప్రధాన కారణ ం ఉంది.ఈ టూరీస్టు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాకాలంలో పర్యాటకులు సందర్శన ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ ఉండే సుందరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తారు.కానీ, అలా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు చాలా మంది ప్రమాదవశాత్తు నీటిలో, జ లపాతాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ప్రకృతిని ఆస్వాదించడం అందరి హక్కు కానీ, ఈ నేపథ్యంలో వారు అత్యుత్సాహాంతో తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
నీటిని వదిలినప్పుడు కొందరైతే సెక్యూరిటీ వారిని వెళ్లకొట్టిన సెల్పీలు దిగుతారు.ఆ సమయంలో నీటిని వదలగానే ప్రవాహంలో కోట్టుకుపోయిన ఘటనలు జరిగాయి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ జిల్లా అదనపు కలెక్టర్ టీకే దామర్ ఈ ఆలోచన చేశారు.
అంతేకాదు ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. """/" /
ఒకవేళ ఈ జిల్లాల్లోని పర్యాటక ప్రాంతంలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా సెల్ఫీలు దిగితే వారికి ఐపీసీ సెక్షన్ 188 కేసు నమోదు చేస్తామని ఆదేశించారు.
ఈ దాంగా జిల్లాలో అందమైనే అడవులు ఉన్నాయి.జలపాతాలు కూడా కనువిందు చేస్తాయి.
కానీ, ఆ జిల్లా వారితోపాటు ఇతర టూరీస్టులు ఇక ఆ ప్రాంతంలో సెల్ఫీలు దిగటాన్ని నిషేధించింది.
ఇక కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడ పర్యాటకులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఈ సారి వెళ్లినవారికి ఫోటోలు దిగే ఛాన్స్ లేకపోవచ్చు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ!