ప్రపంచ కప్‌ను ‘వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తా : కెనడా నుంచి పన్నూ హెచ్చరికలు .. గుజరాత్‌లో ఎఫ్‌ఐఆర్
TeluguStop.com
ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కెనడాలోని ఖలిస్తాన్ గ్రూపులు, సిక్కు సంస్థలు రెచ్చిపోతున్నాయి.ముఖ్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ ‘ఎస్ఎఫ్‌జే’( SFJ ) యాక్టీవ్‌గా పనిచేస్తోంది.
కెనడాలోని హిందువులంతా భారతదేశానికి వెళ్లిపోవాలంటూ ఇటీవల ఆ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తాజాగా మరికొద్దిరోజుల్లో భారత్ వేదికగా జరుగనున్న క్రికెట్ ప్రపంచకప్‌ను టార్గెట్ చేస్తూ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు.
ప్రపంచకప్‌ను ‘‘ వరల్డ్ టెర్రర్ కప్’’గా మారుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.దీనిపై గుజరాత్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఆయనపై అహ్మదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నగర పోలీస్ శాఖలోని సైబర్ క్రైమ్ బ్రాంచ్ .
విదేశీ నంబర్ నుంచి పంపిన ప్రీ రికార్డ్ వాయిస్ మెసేజ్ ద్వారా పన్నూ ఈ హెచ్చరికలు చేసినట్లు గుర్తించారు.
"""/" /
+447418343648 ఫోన్ నంబర్ నుండి చాలా మందికి ముందస్తుగా రికార్డ్ చేసిన బెదిరింపు మెసేజ్ వచ్చినట్లుగా తమ దృష్టికి వచ్చిందని సైబర్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎన్ ప్రజాపతి ఫిర్యాదులో తెలిపారు.
ఈ మెసేజ్‌ను అందుకున్న చాలామంది వివిధ మాధ్యమాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
అక్టోబర్ 5న క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కాదని.‘‘వరల్డ్ టెర్రర్ కప్’’ ప్రారంభమవుతుందని , ఎస్ఎఫ్‌జే కార్యకర్తలు ఖలిస్తానీ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడించబోతున్నారని పన్నూ అందులో హెచ్చరించాడు.
"""/" /
షాహీద్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని.మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లను ఉపయోగిస్తామని గురుపత్వంత్ అన్నాడు.
మీ హింసకు వ్యతిరేకంగా ఓటును ఉపయోగించబోతున్నాం.అక్టోబర్ 5వ తేదీని ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అది ప్రపంచ క్రికెట్ కప్ కాదు , అది ప్రపంచ టెర్రర్ కప్‌కు నాంది అవుతుంది అని పన్నూ వ్యాఖ్యానించాడు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.గురుపత్వంత్ సింగ్ ( Gurupatwant Singh )పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఇతను విదేశాల నుంచి సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థను నడుపుతున్నాడు.భయాన్ని వ్యాప్తి చేయడానికి, దేశంలోని సిక్కులు, ఇతర మతాల మధ్య శత్రుత్వం సృష్టించడానికి, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటానికి పన్నూ ప్రయత్నిస్తున్నాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
గతంలోనూ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌లో అతను ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడని వెల్లడించారు.