సముద్ర గర్భంలో ఉండే శివాలయం గురించి తెలుసా..?

మన భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలు ఉన్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయని కచ్చితంగా చెప్పొచ్చు.

ఎన్నో వింతలు, విశేషాలు ఉన్న దేవాలయాలలో శివాలయాలు( Shivalayam ) ఎన్నో ఉన్నాయి.

అందులోను గుజరాత్ లో( Gujarat ) శివుడి దేవాలయాలు చాలానే ఉన్నాయి.సముద్ర తీరాన కూడా కొన్ని శివాలయాలు ఉన్నాయి.

భావ్ నగర్ కు 23 కిలోమీటర్ల దూరంలోని అరేబియా తీరాన కొలియాక్ గ్రామంలో సముద్ర మధ్యలో ఉన్న శివాలయం ఎంతో ప్రత్యక్షమైనది.

ఈ దేవాలయం చూడడానికి కాస్త భయానకంగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే సముద్ర గర్భంలో ఉండే పరమేశ్వరుడిని దర్శిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఇక్కడ శివున్ని నిష్కలంక్ మహాదేవ్( Nishkalank Mahadev Mandir ) అని కూడా పిలుస్తారు.

అయితే ఈ ఆలయానికి వచ్చే పర్యాటకులు ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి వీలు కాదు.

ఉదయం సముద్రంలో పెద్ద ఎత్తున అలలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది.

ప్రతి రోజు 10 గంటల సమయంలో సముద్రంలో అలలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి.

"""/" / ఆ సమయంలో జెండాతో ఉన్నట్టు ఒక స్తూపం ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి.

ఎంతో కష్టమైనా భక్తులు ఈ దేవాలయంలో పూజలు చేస్తూనే ఉంటారు.అమావాస్య, పౌర్ణమి రోజులలో భక్తులు ఇక్కడ విశేషంగా సంఖ్యలో వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రోజు భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.మహాశివరాత్రి పండుగ సమయంలో భోళా శంకరుడికి పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు.

"""/" / ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మరణిస్తే వారి ఆస్తికలు సముద్ర గర్భంలో కలిపితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు.

మధ్యాహ్న సమయంలో సముద్రం కొంత భాగం వెనక్కి వెళ్లడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయం సముద్ర గర్భంలో ఏ విధంగా నిర్మించారు అనే రహస్యం సమాధానం లేని ప్రశ్నల మిగిలిపోయింది.

పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే కథల్లో ఇవీ ఉండకూడదా..?