కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం.. !

రోజు రోజుకు కరోనా వార్తలు ప్రజలను కన్‌ఫ్యూజన్ చేస్తున్నాయట.అదే సమయంలో భయాందోళనకు కూడా గురిచేస్తున్నాయంటున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర స్దాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యి కోవిడ్ కట్టడికి తీసుకోవలసిన చర్యలను చేపట్టాయి.

ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కరోనా కారణంగా రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఆనీ స్కూల్స్‌ను మూసివేసింది.

తాజాగా ఈనెల 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను మూసివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

అదీగాక కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతుండంతో ఆఫ్‌లైన్ తరగతులను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

ఇక ఈ మాయదారి కరోనా వల్ల ప్రతి వయస్సు వారికి ఏదోలా నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే.

కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా కరోనా వ్యాప్తి ఆగడం లేదు.మరి ఇదేమి చిత్రమో.

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. సీఎం జగన్ హాట్ కామెంట్స్