గిన్నిస్ రికార్డు: చేతి గోళ్ళతో గిన్నిస్ రికార్డుకెక్కిన 70 ఏళ్ళ వృద్ధుడు!

ఇపుడు యువకులు 30 సంవత్సరాలకే ముసులైపోతున్నారు.అదేనండి, 30 ఏళ్లకే మాకు ఏమి చేతకాదు, సగం జీవితం అయిపోయిందని మనలో అనేకమంది దిగులు చెందుతూ వుంటారు.

అలాంటివాళ్ళందరికీ ఈ ముసలి తాత స్ఫూర్తిదాత.అవును.

70 ఏళ్లకే అతగాడు గిన్నిస్ అఫ్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.అవును.

యాపిల్‌ కనిపించగానే మనం ఏం చేస్తాం? వెంటనే ఓ చాకు కోసం వెతుకుతాం.

లేదంటే నోటితో కొరుక్కు తింటారు.కానీ పాకిస్తాన్‌కు చెందిన 70 ఏళ్ల నసీముద్దీన్‌కు తన చేతిగోరు చాలు.

నిమిషంలోపే ఒకటి, రెండు కాదు.ఏకంగా 21 యాపిల్స్‌ను చేతితో క్రష్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును బద్దలు కొట్టేశాడు.

దాంతో అంతకుముందు నిమిషానికి 8 యాపిల్స్‌ను క్రష్‌ చేసిన రికార్డు ఉండగా అదనంగా మరో 13 యాపిల్స్‌ను ఇతడు తన గోటితో కట్‌ చేసి ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు.

యాపిల్‌ చేతిలోకి వచ్చాక గ్రిప్‌ దొరకగానే.గోటితో కట్‌ చేసి, చేతితో చిదిమేస్తాడు.

అలా నిమిషంలోపే 21 యాపిల్స్‌ను కట్‌ చేశాడు.2021 ఆగస్టు 22న కరాచీలో ఈ రికార్డును ప్రదర్శించగా.

ఈనెల 24 గిన్నిస్‌ రికార్డును అధికారికంగా ప్రకటించింది.వృత్తి పరంగా వెల్డర్‌ అయిన నసీముద్దీన్‌ చేతులకు ఆ బలం, ఆయన చేస్తున్న పనివల్ల వచ్చిందని అతని సన్నిహితులు చెబుతున్నారు.

మరెందు కాలుష్యం, ట్రై చేసేద్దాం అంటారా? ఆగండాగండి.ఇది అంత సులువైన పని కానేకాదు.

దీనికి ఎన్నో ఏళ్ళ కృషి ఉండాలని అంటున్నారు నసీముద్దీన్‌.ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంతో సునాయాసంగా ఇలాంటి పనులు చేయవచ్చని చెబుతున్నాడు.

కాగా ఇతగాడిని చూసిన స్థానికులు ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారు.ఇలా చేయడం కోసం కొంతమంది యువకులు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.

దాంతో మన నసీముద్దీన్‌ సంగతి బయటపడింది.దాంతో నసీముద్దీన్‌ ఇపుడు గిన్నిస్ రికార్డ్స్ సాధించాడు.

గుజరాత్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఇదే…