ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..!
TeluguStop.com
ఈ ఫోటో చూశాక కూడా నటి ఎవరో గుర్తు పట్టలేద? సరే మీకు ఒక క్లూ.
మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల చేత ఏ మాయ చేసావే అని అనిపించింది.
ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకా గుర్తు రాలేదా? అదేనండి.అక్కినేని నాగార్జున కోడలు సమంత.
మొదటి సినిమాతోనే ఆహా అనిపించినా ఈ హీరోయిన్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యింది.
కేవలం మనుషులతోనే కాకుండా ఈగలతోను సినిమాలు తీసిన హీరోయిన్ ఈమె.స్టార్ డైరెక్టర్స్ అందరి దర్శకత్వంలో నటించినా ఈ భామ ఎంతోమంది డ్రీమ్ గర్ల్.
దాదాపు టాలీవుడ్ హీరోల అందరి సరసన నటించి అందరికి సూపర్ హిట్ సినిమాలు అందించిన సమంత గత సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాల విజయాలు అందుకుంది.
"""/"/
పెళ్లి తర్వాత కూడా భర్తతో కలిసి మజిలీ సినిమాలో బాధ్యతగల భార్యలా నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఇంకా ఓ బేబీ సినిమాలో నటించి 60 ఏళ్ళ బామ్మాలా కూడా మార్కులు కొట్టేసింది.
ఎక్కడికి వెళ్లిన తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకొని అందరితో ప్రశంసలు పొందుతుంటుంది సమంత.
ఇటీవలే జరిగిన దగ్గుబాటి రానా పెళ్ళిలో కూడా అతి ఖరీదైన దుస్తులలో మెరిసి రెండు రోజులు వార్తల్లో నిలిచినా సంగతి తెలిసిందే.