గుడివాడ రాజ‌కీయం ఇంట్రెస్టింగ్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచే ఆ ఇద్ద‌రు పోటీ..!!

కీల‌క స్థానాల్లో కీల‌క వ్య‌క్తులు పోటీ చేస్తే దానిపై ఆస‌క్తి రాష్ట్ర‌మంతా ఉంటుంది.

ఇప్పుడు అలాగే క‌బ‌డుతోంది ఓ నియోజ‌క‌వ‌ర్గం.ఒక‌ప్పుడు రాష్ట్ర రాజ‌కీయం ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే మొద‌లైంది.

అదే కృష్ణ జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం.పార్టీ పెట్టి అతిత‌క్కువ కాలంలో అధికారంలోకి వ‌చ్చిన ఎన్టీ రామారావు ఇక్క‌డి నుంచే పోటీ చేసి విజ‌యాన్ని అందుకున్నారు.

ఇక్క‌డి నుంచి గెలిచే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అదిష్టించారు.అందుకే గుడివాడ నియోజ‌క వ‌ర్గానికి ప్ర‌త్యేక స్థానంగా భావిస్తారు.

అయితే ఎన్టీఆర్ ఆ స్థానాన్ని వ‌దిలేశాక ఆయ‌న కుటుంబ స‌భ్య‌లు ఎవ‌రూ కూడా అక్క‌డి నుంచి పోటీ చేయ‌లేదు.

కానీ.టీడీపీ నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేసి రెండు సార్లు గెలిచారు.

ఆ త‌ర్వాత వైసీపీలో చేరి మరో రెండు సార్లు ఇక్క‌డి నుంచే గెలిచి మంత్రి కూడా అయ్యారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా నాని ఇక్క‌డి నుంచే పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.ఈ నేప‌థ్యంలోనే టీడ‌పీ అక్క‌డి నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని దింపాల‌ని స‌మాలోచ‌న‌లు చేస్తోంద‌ట‌.

కాగా వంగవీటి రంగా కుమారుడు రాధాను బ‌రిలోకి దింపాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫున ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచే మ‌రో సినియ‌ర్ నేత పోటీకి దిగాల‌ని కూడా ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు రెండో కూతురు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ ఈ సారి పోటీ దింపాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/Guada-politics-is-interesting-In-the-coming-elections-radha-kodalinani-purandheswari-detailsd!--jpg" / ఎందుకంటే ఇటీవ‌ల కొడాలి నాని పురంధేశ్వ‌రిపై చేసిన కామెంట్స్ అందుకు ఊత‌మిస్తున్నాయి.

పురంధేశ్వ‌రి పోటీ చేస్తారన్న కచ్చితమైన సమాచారం ఉంది కాబ‌ట్టే గుడివాడలో రైల్వే గేట్ల మీద ఫ్లై ఓవర్లను పురంధేశ్వరి అడ్డుకుంటున్నారు నాని ఆరోపించిన‌ట్లు చెబుతున్నారు.

అందుకే గుడివాడ అభివృద్ధి కుంటుపడుతుందని పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

ఫ్లై ఓవ‌ర్ ను అడ్డుకుంటే గుడివాడ నుంచి వెళ్లే రైళ్ల‌ను ఆపేస్తామని అన్నారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/Guada-politics-is-interesting-In-the-coming-elections-radha-kodalinani-purandheswari-detailss!--jpg" / అయితే గుడివాడ నుంచి పురంధేశ్వ‌రీ పోటీ చేయాల‌నుకుటుంద‌న్న ప‌క్కా స‌మాచారంతోనే నాని విమ‌ర్శిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

అయితే నాని కామెంట్స్ పై పురంధేశ్వ‌రీ స్పందించ‌లేదు.కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నానిపై మండిప‌డుతున్నారు.

ఎన్టీఆర్ వ‌ల్లే రాజ‌కీయంగా ఎదిగార‌ని అది గుర్తుంచుకుని మాట్లాడ‌ల‌ని సూచిస్తున్నారు.ఇక టీడీపీ నుంచి, బీజేపీ నుంచి వీళ్లు పోటీకి దిగితే నాని గెలుపు అంత ఈజీ కాదంంటున్నారు.

ఇన్నాళ్లు మోక్షజ్ఞ సినీ ఎంట్రీనీ అడ్డుకుంది ఆయనేనా.. వెలుగులోకి వచ్చిన నిజం!