ఆ జామ పండు సాగుతో పది లక్షల ఆదాయం.. ఎలా అంటే?
TeluguStop.com
చాలామంది రైతులు తమ పంట పొలాల్లో పండించే పంటకు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ ఆదాయాన్ని సంపాదించుకుంటారు.
ఏం చేయలేని పరిస్థితిలో వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకుంటారు.కానీ ఇక్కడ ఓ రైతు తన జామ పండు తోట తో ఏకంగా పది లక్షల ఆదాయంను సంపాదించుకుంటున్నాడు.
గుజరాత్ లో టంకారా ప్రాంతానికి చెందిన మగన్ క్రమియా.ఇతను ఓ రైతు.
తను తన పొలంలో పెసలు, మినుములు పండించేవాడు.కానీ వాటికి పెట్టిన పెట్టుబడి కంటే తనకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉందని.
ఏం చేయలేక జామ తోటను పెట్టుకున్నాడు.దీంతో ఏకంగా ఏడాదికి రూ.
10 లక్షల వరకు ఆదాయం ను పొందుతున్నాడు.అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ తను పండించిన ఒక్క జామకాయ బరువు రెండు కిలోల వరకు ఉంటుందని తెలిపాడు.
"""/"/
మొత్తం 50 ఎకరాల భూమి లో జామ తోటను పెట్టి మంచి లాభాన్ని అందుకుంటున్నాడు.
తన తోట కు సంబంధించిన జామకాయల బరువు గురించి పలువురు ప్రశ్నించగా.తన ఐదేళ్ల క్రితం ఇజ్రాయిల్ టెక్కిక్ సాయంతో వాళ్లు పండించే జామ గురించి వాళ్లను అడిగిమరీ జామ సాగు కు కావలసిన పద్ధతులు తెలుసుకున్నానని తెలిపాడు.
ఇదిలా ఉంటే జామ తోట కు సంబంధించిన చెట్ల కోసం ఛత్తీస్ గడ్ లోని రాయపూర్ లో థాయిలాండ్ లో జామ తోట కు సాగుచేసే మొక్కలను పరిశీలించి అక్కడి నుండి ఒకేసారి ఐదువేల మొక్కలను తెచ్చి తన భూమిలో నాటానంటూ.
ఆ మొక్కలకు సంబంధించిన పద్ధతులను తెలుసుకున్న తను వాటికి సరైన పద్ధతిలో పోషకాలను అందించానంటూ.
దీంతో ఆ జామ తోట ఏడాదిన్నర లో మంచి ఫలితం ఇచ్చిందని.ఊహించనంత లాభాన్ని అందించిందని ఆ రైతు తెలిపాడు.
ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్‌తో ఆ సమ్యలన్నిటికి చెక్..