సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం..కరోనా ఔషధాలు, పరికరాలపై తగ్గిన పన్నులు.. !

కరోనా వల్ల ప్రజలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు భారంగా తన బ్రతుకీడుస్తున్నాడు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఆశతో ఎదురు చూస్తున్నాడు.కనీసం ఇకనైన ప్రభుత్వాల మనస్సు కరిగి ధరలు తగ్గిస్తారేమో అని.

కానీ ప్రజల బాధలు చూస్తున్న ప్రభుత్వాలకు కనీసం చీమకుట్టినట్లుగా కూడా అవడం లేదు.

ఇకపోతే నేడు సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించినట్టుగా నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు.

వీటితో పాటుగా తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను పరిశీలిస్తే.రెమ్ డెసివిర్ ఇంజక్షన్స్ పై 12 శాతం నుంచి 5 శాతానికి, టోసిలిజుమాబ్, బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ల పై కూడా జీఎస్టీ తగ్గించినట్లుగా వెల్లడించారు.

ఇవే కాకుండా కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 3 రకాల మందులపై, ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలపై, హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీ కుదింపు చేశారట.

అలాగే ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి, అంబులెన్సులపై 28 నుంచి 12 శాతానికి జీఎస్టీ తగ్గించేశారట.

ఇకపోతే శ్మశాన వాటికల్లో వినియోగించే ఎలక్ట్రిక్ ఫర్నెస్ లపై 5 శాతం జీఎఈస్టీ తగ్గించగా, వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాలపై 5 శాతం జీఎస్టీ యథాతథంగా అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

మార్స్‌పై అణు యుద్ధం నిజమేనా.. జీవం అంతా నాశనమైంది అందుకేనా?