తెలంగాణ కాంగ్రెస్ ఇక అంతేనా ? మార్పు రానట్టేనా ?

కరవమంటే కప్పకు కోపం.విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా  తయారయింది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యవహారం.

పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడంతో, ఎవరికి వారు తామే గొప్ప లీడర్లము అనే అభిప్రాయంలో ఉంటూ వస్తుండడం, తమ కంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం,  ఇవన్నీ సీనియర్ నాయకులకు ఏమాత్రం నచ్చడం లేదు.

దీని కారణంగానే ఎప్పటికప్పుడు ఏదో ఒక పంచాయతీ తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతూ ఉంటుంది.

ఏదో ఒక నాయకుడు ఏదో ఒక విషయం పై కలత చెందుతూ అధిష్టానానికి తలనొప్పులు తీసుకు వస్తూనే ఉంటారు.

తమను కలుపుకు వెళ్లడంలేదని , తమ అనుచరులకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని , ఇలా రకరకాల కారణాలతో  అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు.

       ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యే ఇదే రకమైన కారణాలతో అధిష్టానంపై అలక చెందారు.15 రోజుల గడువు కూడా విధించారు.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పార్టీలో సీనియర్ అయిన తనను పట్టించుకోవడం లేదని తనకు సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు అంటూ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు.

ఆ అసంతృప్తితోనే పార్టీ మారేందుకు సిద్ధం అన్నట్టుగా సంకేతాలు పంపించారు.    """/"/ ఈ విధంగా సొంత పార్టీ నాయకుల పైనే పోరాటం అన్నట్లుగా వ్యవహారాలు ఉంటున్నాయి తప్పా, అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఢీ కొట్టి  2024 లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేయాలనే పట్టుదల అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు.

ఈ తరహా రాజకీయాల కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం బాగా తగ్గి బీజేపీ ప్రభావం పెరిగింది ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బీజేపీ ఉండగా, కాంగ్రెస్ మాత్రం సొంత పార్టీ నాయకులతోనే పోరాటం చేస్తోంది.

బహామాస్‌లో గ్యాంగ్ వార్లు, షార్క్ ఎటాక్స్‌.. అమెరికా టూరిస్టులకు వార్నింగ్!