వ్యాపారం అభివృద్ధి చెందాలంటే.. ఇలా చేయాల్సిందే!
TeluguStop.com
సాధారణంగా మన హిందువులు ఆచార సంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాలను కూడా ఎక్కువగా నమ్ముతారు.
మన ఇంట్లో అలంకరణ వస్తువుల నుంచి ప్రతి ఒకటి వాస్తుపరంగా ఆలోచించి తీసుకుంటాము.
ఇందులో భాగంగానే ఇంట్లో గుర్రాలు ఉన్నటువంటి ఫోటోలు ఉంటే చెడు జరుగుతుందని చాలామంది భావిస్తుంటారు.
అయితే నిజానికి మన ఇంట్లో గుర్రాలు ఉండే ఫోటో ఉంటే ఏం జరుగుతుంది? ఇలాంటి ఫోటోలను మన ఇంట్లో ఉంచుకోవచ్చా అనే ఈ విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో గుర్రాలు ఉన్నటువంటి ఫోటోలను పెట్టుకోవచ్చు.అయితే ఏడు గుర్రాలు పరిగెడుతూ ఉన్నటువంటి ఫోటో మన ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా గుర్రాలు పరిగెడుతున్న ఫోటో మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఎప్పుడు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ముఖ్యంగా వ్యాపారం చేసే చోట ఈ విధమైనటువంటి ఫోటో ఉంటే వ్యాపారం అభివృద్ధి బాటలో నడుస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధమైనటువంటి ఫోటోను మన క్యాబిన్ దగ్గర ఉంచాలి.
గుర్రాలులోపలి వైపుకు వచ్చే విధంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెంది లాభాల బాటలో నడుస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే ఈ విధమైన ఫోటోలను మన ఇంటిలో పెట్టవచ్చు.కానీ ఆ ఫోటోలో గుర్రాలు ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలని మాత్రమే పెట్టుకోవాలి.
ఎట్టిపరిస్థితుల్లోనూ కోపంగా ఉన్న గుర్రాల ఫోటోలను మన ఇంట్లో ఉంచకూడదు.పొరపాటున ఒక గుర్రం ఉన్నటువంటి ఫోటోను మన ఇంట్లో పెట్టడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.
కనుక ఇంట్లో ఎల్లప్పుడు ఏడు గుర్రాలు కలిగినటువంటి ఫోటోలు పెట్టడం వల్ల మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
వీడియో వైరల్.. ఇది ఆటోనా..? లేక నడిచే డిజిటల్ లైబ్రరీనా?