బీజేపీ లో గ్రూపుల గోల ? దెబ్బేసేది ఎవరో ? 

అన్ని పార్టీల్లోనూ ఉన్నట్టుగానే తెలంగాణ బీజేపీ లోను గ్రూపుల గోల ఇప్పుడు ఎక్కువైంది.

ముఖ్యంగా కీలకమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు, పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది.

అయితే ఇటీవల టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ వ్యవహారంతో ఈ గ్రూపు రాజకీయాలు మరింత ముదరడం తో పాటు , కేంద్ర బీజేపీ పెద్దల వరకు ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.

అసలు ఈటెల రాజేందర్ తమ వల్లే బీజేపీలో చేరాడు అంటూ ఒక వర్గం చెప్పుకుంటూ ఉండగా, మరో వర్గం మాత్రం ఈ క్రెడిట్ అంతా తమదేనంటూ గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో, ఈ వ్యవహారం మరింత ముదిరినట్లు గా కనిపిస్తోంది.

ఈ ఆధిపత్య పోరు ముదిరి భౌతికంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లిందనేది ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ వివేక్ తానే సర్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ వ్యవహారం పార్టీలోని కొంతమంది నాయకులకు నచ్చకపోవడంతోనే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపి మరి హుజురాబాద్ ఎన్నికలలో వివేక్ కు ఏమాత్రం నచ్చని వారికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ కు వివేక్ కు మధ్య జరుగుతున్న వ్యవహారాలకి సంబంధించి సోషల్ మీడియాలోనూ ట్రోల్ అవుతున్నాయి.

ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్టుగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ ఈ పరిణామాలతో ఆగ్రహంగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ హుజురాబాద్ లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా లేక శత్రువర్గం కు క్రెడిట్ దక్కకుండా పావులు కదుపుతారా అనేది ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులకు ఉత్కంఠగా మారింది.

ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలను బీజేపీ అధిష్టానం పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.రాబోయే ఎన్నికలకు ఇది కూడా రెఫరెండం గా మారే అవకాశం ఉండటంతో, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ గెలుపుకు ఢోకా లేకుండా చూసుకుంటున్నారు.

కానీ ఈ గ్రూప్ పాలిటిక్స్ దెబ్బెస్తాయేమో అనే భయాందోళనలు ప్రస్తుతం ఈటెల అనుచరుల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?