ఆ సీక్రెట్స్ ఏంటి ..? ఈ గొడవలేంటి..? టి. కాంగ్రెస్ లో ముదిరిన పోరు !

తెలంగాణ కాంగ్రెస్ లో మొదలయిన లుకలుకలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి.నేతలు నువ్వా నేనా అనే రేంజ్ లో ఎవరికి వారు గోతులుతీసే పనిలో పడ్డారు.

నేతలంతా సఖ్యతగా ఉండాలని అధిష్టానం ఎంత నచ్చచెప్తున్నా.పెడచెవిన పెడుతున్నారు.

తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి వ్య‌తిరేకంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు రహ‌స్యంగా స‌మావేశం కావ‌డం పార్టీలో క‌ల‌వ‌రం రేపుతోంది.

ఉత్త‌మ్ ప‌ని తీరుపై గుర్రుగా ఉన్న ఆ నేత‌లు ఆయనకు ఎలా పొగపెట్టాలా అనే ఆలోచనలో ఉన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఉత్త‌మ్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న వ్యతిరేక వ‌ర్గం రహస్య మీటింగ్ పెట్టడం టి.

కాంగ్రెస్ లో సంచలనం లేపుతోంది.మాకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ ఉత్తమ్ అనుచర వర్గం ఫైర్ అవుతున్నారు.

అంతే కాలేదు ఈ రహస్య మీటింగ్ లపై అధిష్టానానికి కూడా అనేక ఫిర్యాదులు కూడా చేసారు.

మేమేమైనా తక్కువతిన్నామా అంటూ ఉత్తమకుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గం వారు కూడా త్వరలోనే రాహుల్ ను క‌లిసేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది.

అయితే.దీనిపై కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇలాంటి సీక్రెట్ మీటింగ్స్ .క్యాడ‌ర్‌ను గంద‌రగోళానికి గురిచేస్తాయ‌ని.

ఇది పార్టీకి మంచిది కాద‌ని చెబుతున్నారు.రహస్య సమావేశాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్ చెబుతున్నాడు.

!--nextpage సమావేశాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిర్వహించుకోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్తున్నారు.

కాకపోతే అవి పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు.ర‌హ‌స్య సమావేశాలపై రెండు వ‌ర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ నేత‌లు.

ఒక‌రిపై ఒక‌రు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు.టి.

కాంగ్రెస్ లో నెలకొన్న ఈ వర్గపోరుకు అధిష్టానం పులిస్టాప్ పెట్టకపోతే పార్టీ పరువు బజారున పడడం ఖాయం.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో అనేక గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి.నాయకులు ఎవరికివారు మేము గొప్ప అనుకుంటే మేము గొప్ప అని జబ్బలు చరుచుకుంటున్నారే తప్ప దీనివల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గురించి మాత్రం ఎవరూ ఆలోచించడంలేదు.

మాయమాటలతో హనీ ట్రాప్ చేస్తున్న జాయ్ జెమీమా