నాదెండ్ల ముందే రచ్చ రచ్చ ! జనసేన లో గ్రూప్ పాలిటిక్స్ ?

జనసేన పార్టీ రాజకీయంగా యాక్టీవ్ అయ్యింది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని,  పార్టీ ని పరుగులు పెట్టించే పనికి శ్రీకారం చుట్టారు .

వరుసగా అనేక ప్రజా సమస్యలపై గళం ఎత్తుతూ,  జనాల్లో జనసేన పై చర్చ జరిగేలా చేస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ పై పెరుగుతున్న వ్యతిరేకత , పడిపోతున్న టీడీపీ  గ్రాఫ్ ఇవన్నీ జనసేనకు బాగా కలిసొస్తుందని,  ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రభావం బాగానే కనిపించింది ఆ పార్టీ  ఖుషీగా ఉన్నారు.

  ఈ పరిణామాలన్నింటినీ ఉపయోగించుకుని రాజకీయంగా చక్రం తిప్పేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది.

  ఈ మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ జనాల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు.

తాజాగా అమలాపురం నియోజకవర్గ సమావేశంలో సాక్షాత్తు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలోనే పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.

నాదెండ్ల మనోహర్ పాల్గొన్న ఈ సమావేశం ఇందుపల్లి ఏ కన్వెన్షన్ హాల్ లో  ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టి బత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ సైతం పాల్గొన్నారు ఈ సమావేశం ముగిసిన అనంతరం మనోహర్  బయటకు వెళుతున్న సమయంలో హాలు బయట ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ముఖ్యంగా సమపన , ఈదరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఇది మరింత తీవ్రతరమై రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం,  కేకలు అరుపులతో ఆ ప్రాంతం లో ఉద్రిక్తత  చోటుచేసుకుంది.

"""/" / రాజబాబుకు నియోజకవర్గం లోని కొంతమంది పార్టీ నాయకులకు మధ్య ఇటీవల కొంత విభేదాలు వచ్చాయి .

దీంతో రెండు వర్గాలుగా పార్టీ చీలింది.మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి నాయకులు సతీష్ ఆ పార్టీ కి రాజీనామా చేసి జనసేన చేరేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆయనను రాజబాబు వర్గం అడ్డుకుంటూ వస్తున్నట్లు సతీష్ వర్గం ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు మధ్య నాదెండ్ల మనోహర్ సమక్షంలోనే  విభేదాలు బయటపడడం పార్టీలో కలవరం పుట్టించింది.

వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే సహజంగానే నల్లటి కురులు మీ సొంతమవుతాయి!