గ్రూప్-2 పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి:ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా: ఈనెల 29,30 తేదీలలో టిఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని,గ్రూప్-2 అభ్యర్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ( Srikanth Varma ) డిమాండ్ చేశారు.

శనివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఎస్ఎఫ్ఐ( SFI ) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ వరకు గురుకుల బోర్డు పరీక్షలు మరియు జూనియర్ లెక్చరర్ల పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 పరీక్ష( Group-2 Exam ) ప్రిపరేషన్ కు విద్యార్థులకు సమయం సరిపోవడం లేదన్నారు.

పరీక్ష సిలబస్ మారడంతో విద్యార్థులు కన్ఫ్యూజన్ కు లోనవుతున్నారని, గ్రూప్-2 అభ్యర్థుల కోరిక మేరకు మూడు నెలలు పరీక్షలు వాయిదా వేసి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు.

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై మరియు విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం లాఠీ చార్జ్ చేసి,అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు.

తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్, అరవింద్,మధు,సతీష్, యాకన్న,అభిలాష్, నరసింహ,శ్రీను,వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?