జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : టీ.ఎస్పీ.ఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.

మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.

మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9న నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , అదనపు కలెక్టర్ పి.

గౌతమిలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం.

మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 563 గ్రూప్ 1 పోస్టులకు ఫిబ్రవరి లో నోటిఫికేషన్ విడుదల చేసిందని, జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 4లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, జూన్ 9న ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షను పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు.

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో గతంలో రెండు సార్లు పొరపాట్లు జరిగాయని, వాటిని పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

గ్రూప్ 1 పరీక్షలు సజావుగా నిర్వహించే దిశగా కలెక్టర్ లను చీఫ్ కోఆర్డినేటింగ్ అధికారులుగా, అదనపు కలెక్టర్ లను అదనపు కోఆర్డినేటింగ్ అధికారులుగా నియమిస్తున్నామని ఆయన తెలిపారు.

పరీక్ష కేంద్రాలలో సంబంధిత అభ్యర్థులకు సరిపడా అవసరమైన మేర వసతులు కల్పించాలని, ఫర్నిచర్ టాయిలెట్స్, త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు.

పరీక్షా కేంద్రంలోకి వచ్చే మహిళా, పురుష అభ్యర్థులను తనిఖీ చేయుటకు పోలీస్ శాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేయాలనీ, పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు.

పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఒక రోజూ ముందుగా వెళ్లి పరీక్షా కేంద్రాన్ని ధృవీకరించుకోవాలని, బయో మెట్రిక్ హాజరు నమోదు దృష్ట్యా 9-00 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, అభ్యర్థులు రెండు గంటల ముందుగా వచ్చే విధంగా చూసుకోవాలని, ఎట్టి పరిస్థతుల్లో 10-00 తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు, బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ తీసుకొని రావాలని తెలిపారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తరలింపు పోలీసుల పర్యవేక్షణలో జరగాలని, ప్రతి అంశం సీసీ కెమెరాలు రికార్డు అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.

జిల్లాలలోని పరీక్ష కేంద్రాలకు ఇంచార్జీ లను నియమించాలని, జిల్లా అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ సిద్ధం చేయాలని, పరీక్ష నిర్వహణకు అవసరమైన మేర సిబ్బందిని నియమించాలని కలెక్టర్ లకు సూచించారు.

అభ్యర్థుల అవసరాల మేరకు అదనపు బస్సులు ఆ రోడ్డులలో నడిపే విధంగా ఆర్టిసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాల తరలింపు సమయంలో పోలీస్ బందోబస్తు ఉండాలని, ప్రశ్న పత్రాల, ఓ.

ఎం.ఆర్ షిట్ లో భద్రతకు స్ట్రాంగ్ రూం లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అభ్యర్థుల బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా అవసరమైన మేర రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో 4699 మంది అభ్యర్థుల కోసం 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, సి.

సి.కెమెరాల ఏర్పాటుతో పాటు, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి,బయోమెట్రిక్ యంత్రాలు 1 రోజు ముందు జిల్లా కు వస్తే పరీక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

మహేష్ బాబు పోకిరి మరియు బిజినెస్ మాన్ సినిమాల వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు ?