వరుడి వినూత్న ఆలోచన.. 51 ట్రాక్టర్లతో పెళ్లి మండపంలోకి ఎంట్రీ

గుర్రం, ఒంటెలు మీద పెళ్లి మండపానికి రావడం చూస్తూ ఉంటాం.లేదా లగ్జరీ కార్లలో రిచ్‌గా పెళ్లికొడుకులు మండపానికి వస్తూ ఉంటారు.

కానీ ఒక రైతు బిడ్డ వినూత్నంగా ఆలోచించాడు.వ్యవసాయ కుటుంబం కావవడంతో వినూత్న ఆలోచన చేవాడు.

ట్రాక్టర్లతో( Tractors ) పెళ్లి మండపానికి వెళ్లాడు.అదీ కూడా ఏకంగా 51 ట్రాక్టర్లతో పెళ్లి మండపానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రాజస్థాన్‌లోని బార్మర్ ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. """/" / బార్మర్( Barmer ) ఏరియాలోని గూడమలానికి గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరి అనే యువకుడికి రోలి గ్రామానికి చెందిన మమతో పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు.

పెళ్లి కూతురు ఇల్లు వరుడి ఇంటి నుంచి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది.

దీంతో పెళ్లి రోజు వధువు గ్రామంలోని పెళ్లి మండపానికి వెళ్లేందుకు వరుడు( Groom ) కొత్త ఐడియా ఆలోచించాడు.

మాములుగా ఎవరైనా కార్లలో వెళుతూ ఉంటారు.అద్దెకు కార్లు తీసుకుని కుటుంబభ్యులు, బంధువులను తీసుకోని వెళ్తారు.

అయితే వరుడిది రైతు కుటుంబం కావడంతో ట్రాక్టర్లలో వధువు గ్రామంలోని పెళ్లి మండపానికి వెళ్లాడు.

"""/" / నవ వరుడు ఇలా ట్రాక్టర్లల్లో రావడం చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

తమది వ్యవసాయ కుటుంబమని, రైతులు ట్రాక్టర్లను గుర్తింపుగా భావిస్తారని వరుడు చెబుతున్నాడు.మా నాన్న పెళ్లికి ఒక ట్రాక్టర్‌ని ఉపయోగించారని, అందుకే తాను ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని చెబుతున్నాడు.

ఇక వరుడి తండ్రి జేతారామ్ మాట్లాడుతూ.మా తండ్రి పెళ్లి ఊరేగింపు ఒంటెలపై సాగిందని చెప్పాడు.

తమకు ఇప్పటికే 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయని, తోటి రైతులతో మాట్లాడి మిగతా ట్రాక్టర్లను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాడు.

ట్రాక్టర్లతో వ్యవసాయం చేసి పంట పండిస్తున్నప్పుడు వాటిపై ఊరేగింపుగా వెళితే తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

మెరూన్ రంగు లో డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్నకృతి శెట్టి ..