వీడియో: వరుడికి రూ.2.5 కోట్ల కట్నం ఇచ్చిన వధువు.. ఇంకా ఎన్నో బహుమతులు..!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌ సిటీలో( Meerut ) జరిగిన ఓ ముస్లిం వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే, ఈ వైరల్‌కి కారణం అరుదైన డాన్సులో లేదంటే ఏదైనా గొడవో కాదు.

ఈ వివాహం వైరల్ కావడానికి ప్రధాన కారణం కుటుంబం వరుడి కుటుంబం కోసం భారీ ఎత్తున బహుమతులు కట్నాలు( Dowry ) ఇవ్వటమే.

ఈ వివాహ వేడుకలో భాగంగా జరిగిన డబ్బు మార్పిడి చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఈ వివాహంలో వరుడి కుటుంబానికి కట్నంగా 2.5 కోట్ల రూపాయలు నగదును వధువు కుటుంబం ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, జూటా చురై అనే సంప్రదాయం ప్రకారం, వరుడి అక్కలు( Groom Sisters ) 11 లక్షల రూపాయలు బహుమతిగా పొందారు.

ఈ సంప్రదాయంలో వధువు కుటుంబం( Bride Family ) వరుడి చెప్పులను తీసుకోవడం ఒక ఆచారం.

అంతేకాకుండా, వివాహం జరిపించిన మౌలానాకు 11 లక్షల రూపాయలు, స్థానిక మసీదుకు 8 లక్షల రూపాయలు దానం చేశారు.

"""/" / మీరట్‌లోని NH-58 హైవేపై ఉన్న ఒక రిసార్ట్‌లో ఈ వెడ్డింగ్( Wedding ) సెలబ్రేషన్స్ జరిగాయి.

అయితే బహుమతులు( Gifts ) కట్నాలు ఇస్తున్న దృశ్యాలను ఎవరో వ్యక్తి చాలా సీక్రెట్ గా రికార్డ్ చేశాడు.

ఈ వీడియోలో వివాహ వేడుక సమయంలో నగదు నిండిన సూట్‌కేసులు చేతులు మారుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు.

ఈ లావాదేవీలు జరుగుతుండగా చాలా మంది అతిథులు చుట్టూ గుమిగూడి ఉన్నారు. """/" / ఈ వివాహ వేడుకలో భాగంగా 75 లక్షల రూపాయల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు.

ఈ వీడియోలో కారు కొనడానికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ఎవరో ప్రకటిస్తున్నారు.వధువు కుటుంబం నగదు నిండిన మరిన్ని సూట్‌కేసులు అందజేశారు.

ఈ పెళ్లిలో డబ్బు ఇంత ఎక్కువగా ఖర్చు ఖర్చు చేయడం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.

మీరట్‌లో జరిగిన ఈ ఖరీదైన వివాహంలో వధువు కుటుంబం, ఘజియాబాద్‌కు( Ghaziabad ) చెందినవారు.

ఈరోజుల్లో మామూలు పెళ్లి చేయాలంటేనే చాలామంది కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి.ఇలాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ వీడియో చాలా చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియో వైరల్( Viral Video ) అయినప్పటికీ, రెండు కుటుంబాలు మీడియాకు దూరంగా ఉన్నాయి.

నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!