ఇల్లరికానికి వెళ్లాల్సి వస్తుందని పెళ్ళికి ముందు రోజే వరుడు....

ప్రస్తుత కాలంలో కొందరు అవగాహన లోపం వల్ల తీసుకున్న నిర్ణయాలు ఇతరుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.

 తాజాగా పెళ్లి చూపుల్లో ఓ యువతిని చూసిన యువకుడు వెంటనే ఆమెతో ప్రేమలో పడి ఆమెతో పాటు ఇల్లరికపు అల్లుడుగా వెళ్లేందుకు నిర్ణయించుకొని తీరా పెళ్లి జరిగే ముందురోజు పరారైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని గ్రామంలో సంతోష్ అనే యువకుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు.

అయితే ఇదే జిల్లాకు చెందిన అటువంటి ఓ గ్రామానికి చెందినటువంటి యువతితో ఇటీవల కాలంలో ఇద్దరికీ పెళ్లి కుదిరింది.

అయితే ఈ క్రమంలో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు తమ కూతురిని పెళ్లి చేసుకునే వరుడు తమ ఇంటికి ఇల్లరికం రావాలని షరతు పెట్టారు.

"""/"/ దీంతో పెళ్లి కూతురు సంతోష్ కి నచ్చడంతో ఇల్లరికం వెళ్లేందుకు కూడా ఒప్పుకున్నాడు.

అయితే ఆ తర్వాత కొంతమంది బంధువులు మరియు స్నేహితులు ఇల్లరికం వెళ్లడం సరికాదని అంతేగాక పలు సూటిపోటి మాటలతో అతడిని రెచ్చగొట్టినట్లు తెలుస్తుంది.

దీంతో ఇల్లరికం వెళ్లడానికి భయపడినటువంటి సంతోష్ నిన్నటి రోజున పెళ్లి పెట్టుకుని మంగళవారం రోజున ఎవరికీ చెప్పకుండా పరారయ్యాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పెళ్లికూతురు తరపు బంధువులు విషయాన్ని ఆరా తీయగా పెళ్లి ఇష్టం లేక సంతోష్ అదృశ్యం అయినట్లు తెలుసుకొని దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సంప్రదించారు.

అలాగే సంతోష్ ఎక్కడున్నావ్ సరే వెతికి పెట్టమని పోలీసులను కోరారు.

చావైనా బ్రతుకైనా సినిమా ఇండస్ట్రీలోనే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!