గ్రీన్ టీతో ఇలా చేస్తే.. జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు!

సాధార‌ణంగా చాలా మంది త‌మ కురులు అందంగా, న‌ల్ల‌గా, ఒత్తుగా ఉండాల‌ని కోరుకుంటారు.

అలా ఉండాల‌ని ఏవేవో ప్ర‌యోగాలు కూడా చేస్తుంటారు.కానీ, అందుకు భిన్నంగా అనేక ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి.

చుండ్రు, జుట్టు రాలిపోవ‌డం, జుట్టు పొట్లిపోవ‌డం, డ్రై హెయిర్ ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.

అయితే అంద‌రూ దాదాపు కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య జుట్టు రాలిపోవ‌డం.వాస్త‌వానికి కుదుళ్లు బలహీనంగా మారిన‌ప్పుడే జుట్టు రాలడం స్టార్ట్ అవుతుంది.

అయితే జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్ట‌డంలో గ్రీన్ టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.నేటి కాలంలో బ‌రువు త‌గ్గేందుకు గ్రీన్ టీను చాలా మంది ప్ర‌తి రోజు ఏదో ఒక స‌మ‌యంలో తీసుకుంటున్నారు.

కానీ, బ‌రువు త‌గ్గించ‌డానికే కాదు.కేశాల‌కు కూడా గ్రీన్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌రి గ్రీన్ టీను కేశాల‌కు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గ్రీన్ టీ మ‌రియు ఎగ్ వైట్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి.అర గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల జుట్టు రాలే స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌ట్టి.

కేశాలు దృఢంగా మార‌తాయి.రెండొవ‌ది.

ఒక బౌల్‌లో గ్రీన్ టీ తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని కేశాల‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా పెర‌గ‌డంతో పాటు.

చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.మూడొవ‌ది.

గ్రీన్ టీను నేరుగా త‌ల‌కు ప‌ట్టించి.బాగా ఆర‌నివ్వాలి.

అర‌గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి.

న‌ల్ల‌గా, దృఢంగా మారుతుంది.