బరువు తగ్గాలనుకునే వారికి అద్భుత పరిష్కారం.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
TeluguStop.com
మన పెద్దలు ప్రతిరోజూ జామపండు తినమని చెప్పినప్పుడు బహుశా ఆ మాటలు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం.
అయితే రోజూ ఓ జామ పండు ( Guava Fruit )తినే వారికి డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం రాదు.
ఇది రుచికి తీయగా ఉండడంతో పాటు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఆరోగ్య ప్రయోజనాలను అందించే విషయంలో జామ ఉత్తమ సూపర్‌ఫుడ్‌లలో ఒకటిగా వైద్యులు దీనిని ప్రశంసిస్తున్నారు.
దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. """/" /
బరువు తగ్గాలనుకునే వారికి జామ పండు మంచి పరిష్కారం.
ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
రోగనిరోధక శక్తిని( Immunity ) బలోపేతం చేయడానికి విటమిన్ సి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు.
జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. """/" / జామపండులో నారింజ( Orange ) కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.
ఫలితంగా సాధారణ ఇన్ఫెక్షన్లు, వ్యాధి కారకాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.చెడు బ్యాక్టీరియా, వైరస్‌లను చంపగల యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలను జామ కలిగి ఉంది.
జామకాయలో లైకోపీన్ అధిక మోతాదులో లభిస్తుంది.ఇది మీ శరీరంలోని క్యాన్సర్ కణాలను నిరోధించడంలో, తగ్గించడంలో ప్రభావవంతమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది.
"""/" /
మధుమేహాన్ని( Diabetes ) నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది.
ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.అంతేకాకుండా, అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
జామలో ఉండే సోడియం, పొటాషియం వంటివి మీ రక్తపోటును నియంత్రిస్తాయి.ఈ పండులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది.
ఇది గుండె జబ్బుల నివారణకు సహాయపడుతుంది.అలసట, ఒత్తిడిని తగ్గిస్తుంది.
జామ పండులోని మెగ్నీషియం మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.జామలో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9 గర్భం దాల్చిన మహిళలకు ఎంతో మేలు చేస్తాయి.
శిశువు యొక్క నాడీ వ్యవస్థ అభివృద్ధిని చేస్తాయి.నరాల సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది.
కాబట్టి, గర్భవతిగా ఉన్నప్పుడు జామపండును తింటే మంచిది.
మన ఇండస్ట్రీ మొత్తం పాన్ వరల్డ్ లోకి వెళ్ళబోతుందా..?