గేమింగ్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. సోనీ ప్లేస్టేషన్ 5పై భారీ డిస్కౌంట్…

టెక్ దిగ్గజం సోనీ ఇండియా( Sony India ) గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.

2023, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు ప్లేస్టేషన్ 5 స్టాండర్డ్ డిస్క్ ఎడిషన్‌పై రూ.

7,500 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.డిస్కౌంట్ తర్వాత కొనుగోలుదారులు దీనిని కేవలం ధర రూ.

47,490కే సొంతం చేసుకోవచ్చు.అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, సోనీ సెంటర్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌తో సహా సెలెక్టెడ్ రిటైలర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్‌పై డిస్కౌంట్ అందుబాటులో లేదు, దీని ధర రూ.

44,990. """/" / డిస్కౌంట్‌తో పాటు, సోనీ ఇండియా ప్లేస్టేషన్ 5( Sony India Playstation 5 ) కోసం కొన్ని కొత్త ఫీచర్లను కూడా ప్రకటించింది.

వీటిలో అసిస్టెన్స్‌ కోసం రెండవ కంట్రోలర్‌కు సపోర్ట్ అందించే ఫీచర్ ఒకటి.ఈ ఫీచర్‌తో కన్సోల్‌ను నావిగేట్ చేయడం లేదా గేమ్‌లు ఆడటం వంటి పనులలో రెండవ కంట్రోలర్‌ను గేమర్లు ఉపయోగించవచ్చు.

కన్సోల్‌ను నావిగేట్ చేస్తున్నప్పుడు హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఎఫెక్ట్స్( Haptic Feedback Effects ) అందించే ఫీచర్ కూడా తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.

ఇది ప్లేయర్ చేతులకు టచ్ ఫీడ్‌బ్యాక్ అందించడం ద్వారా మరింత అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

"""/" / పార్టీ UI ఇంటర్‌ఫేస్‌కి అప్‌డేట్ కూడా తీసుకొస్తామని సోనీ ఇండియా ప్రకటించింది.

ఇది క్లోజ్డ్ పార్టీలకు ఇతరులను ఆహ్వానించడాన్ని ఆటగాళ్లకు సులభతరం చేస్తుంది.ఈ ఏడాది చివర్లో ప్లేస్టేషన్ 5 వినియోగదారులందరికీ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

ప్లేస్టేషన్ 5 స్టాండర్డ్ డిస్క్ ఎడిషన్ ముఖ్య ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఇందులో 825GB కస్టమ్ SSD అందించారు.

ఈ స్టోరేజీతో మెరుప వేగంతో, దాదాపు ఇన్‌స్టంట్ లోడింగ్ సమయాలతో గేమ్‌లను ఆడుకోవచ్చు.

ఇందులో ఆఫర్ చేసిన 8-కోర్ AMD జెన్ 2 CPU శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాలతో స్మూత్ గేమ్‌ప్లేను అందిస్తుంది.

ఇక ఈ ప్లేస్టేషన్‌లో అందించిన 10.28 TFLOPS AMD RDNA 2 GPU రియలిస్టిక్ లైటింగ్, అద్భుతమైన గ్రాఫిక్‌లను అందిస్తుంది.

టెంపెస్ట్ 3D ఆడియోటెక్ గేమ్‌లో మిమ్మల్ని లీనమయ్యేలా ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.ఇది 4K బ్లూ-రే డిస్క్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది.

మీకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలను అద్భుతమైన 4K రిజల్యూషన్‌లో చూడడానికి వీలు కల్పిస్తుంది.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతున్నారా..?