13మంది ప్రాణాలు తీసిన బూడిద మేఘం.. వీడియో చూస్తే..

కొన్ని ప్ర‌మాదాలు ఊహించ‌డానికి కూడా విచిత్రంగా అలాగే భ‌యంక‌రంగా ఉంటాయి.కాగా ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప్ర‌మాదం గురించి వింటే మీ గుండెలు జారిపోతాయి.

మీరెప్పుడైనా మంచు మేఘం గురించి లేదంటే ద‌ట్ట‌మైన మేఘాల గురించి విని ఉంటారు.

కానీ బూడిద మేఘం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అంటే మీ సమాధానం నో అనే వ‌స్తుంది క‌దా.

కానీ ఇప్పుడు మీకు ఇలాంటి బూడిద మేఘం గురించి చెప్ప‌బోతున్నాం.ఇది ఎంత ప్ర‌మాద‌మో ఈ వార్త పూర్తిగా చ‌దివితే మీకే అర్థం అవుతుంది.

దాదాపు 13 మంది ప్రాణాల‌ను పొట్ట‌న బెట్టుకుంది.ఇంత‌మంది ప్రాణాలు తీయ‌డంతో పాటు దాదాపు 40మందిని ఆస్ప‌త్రి పాలు చేసింది ఈ బూడిద మేఘం.

ఈ విచిత్ర‌మైన, భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న ఇండోనేషియా దేశంలోని జావా ద్వీపంలో చోటుచేసుకుంది.అయితే ఈ ద్వీపంలో ఉండే సెమేరు అగ్నిపర్వతం ఒక్క‌సారిగా పేలింది.

ఇంకేముంది ఈ అగ్ని ప‌ర్వ‌తం నుంచి పెద్ద ఎత్తున బూడిద వెలువ‌డి, అది పెద్ద మేఘంలా మారిపోయింది.

ఇది కాస్తా జ‌నార‌ణ్యంలోకి దూసుకురావ‌డంతో దాన్ని చూసిన వారంతా కూడా ఒక్క‌సారిగా ప‌రుగులు తీశారు.

ఈ భారీ బూడిద మేఘాలు చుట్టు ప‌క్క‌న గ్రామాల‌ను క‌మ్మేశాయి. """/" / ఈ బూడిద కుప్ప‌లు కుప్ప‌లుగా మ‌నుషుల మీద ప‌డ‌టంతో దాదాపు 13 మంది శ్వాస ఆడ‌క చ‌నిపోయారు.

41 మంది వ‌ర‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.ఇక అస్వ‌స్థ‌త‌కు గుర‌యిన వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించినా చాలామంది ప‌రిస్థితి విష‌మంగానే ఉంది.

ఇక ఈ అగ్ని ప‌ర్వ‌తం పేలుడుతో 50 వేల అడుగుల దాకా ఆకాశంలో బూడిద ఎగిసిప‌డుతుంద‌ని, కాబ‌ట్టి విమానాల రాక‌పోక‌ల విష‌యంలో ఆయా సంస్థ‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

ఇక బూడిద మేఘానికి సంబంధించిన వీడియోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Kadiyam Srihari : రేపు కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి