స్మశాన వాటికను పట్టాలు చేసుకున్నారు…!

నల్గొండ జిల్లా:వేములపల్లి మండలం ఆమనగల్లు, పాములపాడు పంచాయతీల పరిధిలో రావువారిగూడెం,సబ్బు వారిగూడెం గ్రామాల ప్రజలు వందల ఏళ్లుగా సర్వే నెంబర్ 713 లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని స్మశాన వాటికగా ఉపయోగిస్తూ తమవారికి అంత్యక్రియలు చేస్తున్నారు.

దీనిని రావువారిగూడెంకు చెందిన కొందరు ఆగ్రకుల భూస్వాములు పదేళ్ల క్రితం దొంగచాటుగా పట్టాలు చేయిచుకొని,ఇది తమ పట్టా భూమి,ఇందులో మీరు అంత్యక్రియలు చెయ్యొద్దని బీసీలపై దౌర్జన్యం చేస్తూ,శవాలను పూడ్చి పెట్టడానికి జానెడు జాగా లేకుండా చేసి ఏడాది కాలంగా తమను నిత్యం అవమానిస్తున్నారని బాధిత బీసీలు గురువారం వేములపల్లి తహశీల్దార్( Tahsildar ) కు వినతిపత్రం అందజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

స్మశానాన్ని( Crematorium ) ఆక్రమించి మమ్ముల్ని అవమానిస్తున్నారని గ్రామానికి భాసా నాగరాజు తెలిపారు.

సర్వేనెంబర్ 713 భూమిలో మా తాతల కాలం నుండి బీసీలు ఖననం చేస్తున్నాం.

కానీ, రెడ్డి కులానికి చెందిన కొందరు ఇది మా భూమి, ఇక్కడ మీరు ఖననం చేయడానికి వీలు లేదని అడ్డుకుంటూ మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారని అన్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు పేరబోయిన సైదులు వాపోయారు.స్మశానవాటికను కొందరు రెడ్లు ఆక్రమించి కొన్నేళ్ల క్రితం వాళ్ల పేరు మీద పట్టాలు చేసుకున్నారు.

మృతదేహాలను ఖననం చేయడానికి జాగా లేకుండా చేసి మమ్ముల్ని అవమానిస్తున్నారన్నారు.అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దీనిపై స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ శర్మను వివరణ కోరగా కొత్తగా విధుల్లో చేరానని,రావువారిగూడెం స్మశాన వాటిక సమస్య మా దృష్టికి వచ్చిందని, సర్వేయర్,ఆర్ఐలను ఫీల్డ్ మీదకు పంపి సర్వే చేయించి,చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హ‌లో అబ్బాయిలు.. ద‌ట్ట‌మైన గ‌డ్డాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!