ద్రాక్షలో బూడిద తెగులు అరికట్టడం కోసం సంరక్షక పద్ధతులు..!

ద్రాక్ష పంటకు( Grapes Crop ) కాస్త చీడపీడల బెడద, తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది.

కాకపోతే తీవ్ర నష్టం కలిగించే తెగులలో బూజు తెగులు( Powdery Mildew ) అనేవి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.

సకాలంలో ఈ తెగులను గుర్తించి తొలి దశలోనే అరికడితే ద్రాక్ష పంటలు అధిక దిగుబడి పొందవచ్చు.

ద్రాక్ష పంటను ఆశించే బూజు తెగులు ఫంగస్( Fungus ) వల్ల వ్యాప్తి చెందుతాయి.

శీతాకాలంలో నిద్రావస్థలో ఉన్న మొగ్గలు లేదా బెరడు పగుళ్లలో ఈ బూజు తెగులకు సంబంధించిన సిలిండర్ బీజంశాలు జీవించి ఉంటాయి.

ఈ తెగులు గాలి ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి.ద్రాక్ష మొక్కల పత్ర హరితంపై లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి.

బూడిద రంగు లేదా తెలుపు రంగు లాంటి శిలీంద్రా పెరుగుదల ఈ మచ్చలపై క్రమంగా అభివృద్ధి చెందడం గమనించవచ్చు.

మొక్క అభివృద్ధి చెందుతుంటే ఈ మచ్చలు కూడా అభివృద్ధి చెందుతూ వ్యాప్తి చెందుతాయి.

చివరికి ఆకులు గోధుమ రంగులోకి మారుతాయి.తొలి దశలో అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.

"""/" / తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి.మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలేటట్టు కాస్త దూరంగా ఉండేటట్లు కోవాలి.

ద్రాక్ష పంటను పందిరి ఆకారంలో సాగు చేసి కత్తిరింపు పద్ధతులను ఎంచుకొని సాగు చేయాలి.

ఎండ ఎక్కువగా తగిలే నెలలలో ద్రాక్ష సాగు చేస్తే వివిధ రకాల తెగుళ్ల బెడద ఉండదు.

ఆకులు అధికంగా పెరగడం నివారించడం కోసం నత్రజని ఎరువులను ఉపయోగించాలి. """/" / సేంద్రీయ పద్ధతిలో( Organic Farming ) ఈ బూజు తెగులను అరికట్టాలంటే గంధకం, హార్టికల్చరల్ నూనె టివి వినియోగించాలి.

ఫంగస్ ను తినే పురుగులు మరియు బీటిల్స్ కొన్ని తీగలలో బూజు తెగులు కాలనీలను తగ్గిస్తాయని సమాచారం.

రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే స్ట్రోబిలురిన్స్ మరియు అజోనాఫ్తలిన్స్ ఆధారిత పిచికారి మందులను ఉపయోగించి తొలి దశలోనే అరికడితే ఎటువంటి నష్టం వాటిల్లదు.

నిరాశపరిచిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కలెక్షన్లు.. ఇంత తక్కువ వస్తే ఎలా అంటూ?