ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet )లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల( Govt Degree College ) ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 57 ప్రకారం ఉత్తర్వులను సెక్రటరీ శ్రీమతి కరుణ వాకటి ఐఏఎస్ చేశారని అన్నారు.

2023 24 సంవత్సరానికి నూతన అడ్మిషన్లు ప్రారంభించబడతాయని కళాశాలలో కోర్సులు బిఏ ఇంగ్లీష్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, సి ఎ, బిఎస్సి బీ జెడ్ సి, బిఎస్సి ఫిజికల్ సైన్సెస్ లలో ప్రతి కోర్సు నుంచి 60 సీట్ల చొప్పున అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.

అదేవిధంగా మండలంలోని ఇంటర్మీడియట్ సెకండియర్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంజాద్ అలీ, లెక్చరర్ వై నరసయ్య లు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాల మంజూరు జీవో కాపీని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్( Oggu Rajitha Yadav ) కు అందజేసిన సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్.

ఉదయం పూట ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?