తాత మజాకానా.. డాన్సులో అంతకు మించి అంటున్నాడుగా.. !!

ఒకప్పుడు సోషల్ మీడియా అంటే పెద్దగా ఆసక్తి కనబరచని ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియానే లోకంగా బతుకుతున్నారు.

ఎవరో ఒకరు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ అవ్వడం జరుగుతుంది.

వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్య పరిచేలా ఉంటాయి.మరి కొన్ని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలతో కుడి ఉంటాయి.

అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఒక పెద్దాయన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక ఓల్డ్ ఏజ్ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఎందుకో.

ఏంటో అనే విషయాలు ఒకసారి చూద్దాం.మన అందరికి డాన్స్ అంటే చాలా ఇష్టం కదా.

సినిమాల్లో హీరో హీరోయిన్స్ డాన్స్ చేస్తుంటే అబ్బా భలే వేసాడే స్టెప్స్ అంటూ తెగ సంబర పడిపోతూ ఉంటాము.

వాళ్ళలా మనం కూడా డాన్స్ చేయాలనీ అనుకుంటాము కదా.కానీ డాన్స్ అనేది ఒక కళ.

అది అందరికి సాధ్యపడేది కాదు.కొంతమందికి డాన్స్ వచ్చినాగాని వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపరు.

మరి కొందరు డాన్స్ రాకున్నాగాని డాన్స్ వేయాలని అనుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్దాయన డాన్స్ అందరిని ఆకర్షించింది.

ఒక పక్క పెళ్లి వేడుక జరుగుతుంది మరో పక్క డీజే పాటలతో పెళ్ళికి వచ్చిన వారంతా హుషారుగా ఉన్నారు.

"""/"/ డీజే పాటలకు ఊపు వచ్చిన ఒక పెద్దాయన తనదైన శైలిలో స్టెప్పులు వేసి డ్యాన్స్ అదరగొట్టాడు.

పెద్దాయన డాన్స్ చూసి పెళ్లికి వచ్చినవారంతా షాక్ అయ్యారు.వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా బహుశా అలా డాన్స్ చేయలేరేమో అనే విధంగా స్టెప్స్ వేసాడు.

వయసు పైబడిన తరువాత ఇంకా నేనేమి చేయగలను అనుకునే అవ్వా తాతలకు ఈ పెద్దాయన డాన్స్ ఒక స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.

ఆరోగ్యంగా ఉన్నంతకాలం వయసుతో సంబంధం లేదని ఈ పెద్దాయన నిరూపించాడు.ప్రస్తుతం ఈ పెద్దాయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్దాయన డాన్స్ కి నెటిజన్లు సైతం ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ లో ఆ ఒక్కటి మిస్ అయింది…