వందేళ్ల వ‌య‌సులో వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించిన బామ్మ‌..

ఇవాళ రేపు మ‌నుషులు ఎలా ఉన్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం.చిన్న ప‌ని చేయ‌డానికి కూడా చాలా బ‌ద్ధ‌కంగా ఫీల్ అవుతుంటారు.

అదేదో పెద్ద బ‌రువు మోస్తున్న‌ట్టు బాధ ప‌డిపోతారు.ఉన్న చోట నుంచి క‌ద‌ల‌కుండా హాయిగా గ‌డిపేయాల‌ని భావిస్తారు.

ఇలాంటి సోమ‌రిపోతులంద‌రికీ ఇప్పుడు ఓ బామ్మ గ‌ట్టి స‌వాల్ విసురుతోంది.ఆమెకు వంద ఏండ్లు వ‌య‌సు వ‌చ్చినా స‌రే యుక్త వ‌య‌స్సు వారిలా ప‌రుగులు తీస్తూ ఆరోగ్యంగా ఉండాల‌ని సూచిస్తోంది.

ఇప్పుడున్న వారిలో కేవ‌లం 60 ఏండ్లు దాటితేనే అంతా అయిపోయిన‌ట్టు భావిస్తుంటారు.ఎలాంటి ప‌నులు చేయ‌కుండా వృద్ధాప్యం వ‌చ్చేసింద‌న్న‌ట్టు ఏ ప‌నీ చేయ‌కుండా ఉండిపోవ‌డం మ‌నం చూస్తున్నాం.

అయితే ఇలాంటి వారికి స‌వాల్ విసురుతూ ఈ మ‌ధ్య ముస‌లి వాళ్లు కూడా యువ‌కుల్లా ప‌నులు చేస్తుండ‌టం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ కావ‌డం మ‌నం చూస్తున్నాం.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.అయితే ఇది మాత్రం చాలా క‌ష్ట‌త‌ర‌మైన‌దిగా క‌నిపిస్తుంది.

ఎందుకంటే వందేండ్ల వ‌య‌సులో కూర్చున్న చోట నుంచి క‌ద‌ల‌డ‌మే చాలా క‌ష్టం. """/" / అలాంటిది లూసియానా సీనియర్‌ గేమ్స్ లో ఓ బామ్మ ఒలింపిక్‌ రికార్డ్‌ను సృష్టించింది.

జాలియా హాకిన్స్ అనే బామ్మ ఏకంగా 100 మీటర్ల ప‌రుగును 62 సెకన్లలో కంప్లీట్ చేసి అంద‌రినీ షాక్ కు గురి చేసింది.

త‌న వ‌య‌సు ఇంకా అయిపోలేద‌ని నిరూపించింది.జూలియా గ‌తంలో కూడా ఇలాంటి రికార్డులు ఎన్నో బ‌ద్ద‌లు కొట్టింద‌ని తెలుస్తోంది.

ఆమె వ‌య‌సు పెరుగుతున్నా కూడా ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా నిత్యం క‌స‌ర‌త్తులు చేయ‌డ‌మే ఆమెను ఇంకా ధృడంగా ఉంచుతున్నాయ‌ని చెబుతున్నారు.

ఇప్పుడు ఈ ఫొటోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి.మ‌రి లేటెందుకు మీరు కూడా చూసి మీ కామెంట్ తెలియ జేయండి.

చరిత్రలో తొలిసారి.. కెనడా బడ్జెట్ రూపకల్పనలో హిందూ సమాజానికి చోటు