ఘనంగా గురునానక్ దేవ్ జీ మహారాజ్ 552వ జయంతి ఉత్సవాలు

గురునానక్ దేవ్ జీ మహారాజ్ 552వ జయంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ గురు సింగ్ సభ అఫ్జల్ గంజ్ నిర్వహణ కమిటీ తెలిపింది.

ఈ నెల 17న గురు ద్వారా సాహెబ్ అశోక్ బజార్ నుంచి నగర కీర్తన ప్రారంభమవుతుందని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

5గురు ప్రముఖులయినా శ్రీ నిషాన్ సాహిబ్, శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ లను పల్లకిలో ఊరేగింపుగా శోభా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

కీర్తనలను ఆలపిస్తూ నగరం లోని సిద్దియంబర్ బజార్, మొజాంజాహి మార్కెట్, జామబాగ్, పుత్లిబౌలి నుండి సెంట్రల్ గురుద్వారా సాహిబ్ అయిన శ్రీ గురు సింగ్ సభను గురుద్వారా సాహిబ్ లో నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సందర్బంగా సిక్కు సాంప్రదాయ శస్త్ర విద్యలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు.నవంబర్ 19న అత్తాపూర్ లో విశాల్ కీర్తన్ దర్బార్ లో శ్రీ గురు నానక్ దేవ్ జీవిత విశేషాలు, ఆదర్షాలను తెలియజేస్తామన్నారు.

రవితేజ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ వచ్చినట్టేనా..?