మద్యానికి బానిసైన వ్యక్తి.. మద్యం కోసం మనవడిని ఏం చేశాడంటే..?

మనిషి మద్యానికి బానిసైతే( Alcohol Addiction ) ఎంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడో, ఎన్ని దారుణాలకు పాల్పడతాడు అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ కుటుంబాలను రోడ్డున పాడేస్తున్నారు.మరికొందరేమో ఏకంగా కడుపున పుట్టిన పిల్లలపైనే అఘాయిత్యాలకు, దారుణాలకు పాల్పడుతున్నారు.

ఒక వ్యక్తి అయితే ఏకంగా మద్యం కోసం సొంత మనవడినే( Grandson ) అమ్మేశాడు.

ఇటువంటి సంఘటనలు వింటే ఇలాంటి దుర్మార్గులు కూడా సమాజంలో ఉన్నారా అనిపిస్తుంది.వివరాల్లోకెళితే.

హైదరాబాద్ ( Hyderabad ) బంజారాహిల్స్ పరిధిలో ఉండే హాకీంపేటలో ఖలీల్ అనే వ్యక్తి నివాసం ఉంటూ మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు పడేవాడు.

కుటుంబ బాధ్యతలను పెడచెవిన పెట్టి ఎప్పుడు మద్యం సేవిస్తూ సోమరిగా తిరుగుతుంటాడు.మద్యానికి డబ్బులు కావాలంటూ కుటుంబ సభ్యులను ప్రతిరోజు కాల్చుకు తినేవాడు.

డబ్బు ఇచ్చేంతవరకు నానా రచ్చ చేసేవాడు.ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులను అమ్మి మద్యం సేవించేవాడు.

"""/" / ఈ క్రమంలో ఖలీల్ కుమార్తె ప్రసవం కోసం పుట్టింటికి వచ్చి ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సమయంలో రెండు రోజుల నుండి మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని ఇంట్లో గొడవ పడ్డాడు.

కానీ కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వకపోవడంతో.ఇంట్లో వాళ్ళు తమ పనులలో కాస్త బిజీగా ఉన్న సమయంలో మనవడిని ఖలీల్ మద్యం కోసం అమ్మేశాడు.

"""/" / తర్వాత కుటుంబ సభ్యులు పసిబిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా గాలించారు.

ఎక్కడ కూడా పసిబిడ్డ ఆడవాళ్లు కనిపించకపోవడంతో ఖలీల్ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి చుట్టుపక్కల వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా విచారించారు.

ప్రాథమిక విచారణలో ఖలీల్ పై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా మద్యం కోసం తానే మనవడిని అమ్మినట్లు అంగీకరించాడు.

ఖలీల్ ఇచ్చిన ఆధారాల ప్రకారం బాబు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చరణ్ కు జోడీగా నేషనల్ క్రష్.. పుష్ప2 రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమా?