ఘనంగా డివివి దానయ్య కుమారుడి వివాహం… వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రెటీలు ఇప్పటికే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా మరికొందరు నిశ్చితార్థం జరుపుకొని ఏడడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నారు.
మరి కొద్ది రోజులలో శర్వానంద్( Sharwanand ) వివాహం జరగబోతుంది.తాజాగా కమెడియన్ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్దార్థ్ నిశ్చితార్థం కూడా ఆదివారం ఎంతో ఘనంగా హైదరాబాద్లో జరిగింది.
"""/" /
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిర్మాత డివివి దానయ్య ( DVV Danayya ) ఇంట కూడా పెళ్లి బాజాలు మోగాయి.
దానయ్య కుమారుడి వివాహం హైదరాబాదులో నేడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.దానయ్య కుమారుడు కళ్యాణ్( Kalyan ) సమత ( Samatha ) అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశారు.
ఇక ఈ వివాహానికి ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు.ప్రస్తుతం దానయ్య కుమారుడి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నేటిజన్స్ సైతం నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
"""/" /
దానయ్య కుమారుడు కళ్యాణ్ వివాహ వేడుకలలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అలాగే రాజమౌళి ఫ్యామిలీ( Rajamouli Family ) మెంబర్స్ కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది.
ఇలా పెళ్లికి వచ్చిన అతిథులు అందరిని స్వయంగా దానయ్య ఆహ్వానించి వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు.
ప్రస్తుతం ఈయన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక కళ్యాణ్ సైతం అధీర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాకు జాంబిరెడ్డి ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా గత ఏడాది రాజమౌళి ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీల సమక్షంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఇదేం ఆనందాంరా బాబు.. విడాకులు వచ్చాయని ఏకంగా?