ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను కార్యోన్ముఖులు చేశారు.
బుధవారం మంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) లోని స్టేట్ ఛాంబర్లో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.
నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజులతో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టిన చర్యల గురించి ఆరా తీసి,వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పండగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ ప్రాధాన్యతను చాటేలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినందున, ప్రతి అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా భావిస్తూ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వం ఆశించిన దానికంటే మరింత విస్తృత స్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలను నిర్వహించి వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఉద్బోధించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఉత్సవాల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్ సి.
నారాయణరెడ్డి మంత్రికి వివరించారు.సమావేశం అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్రం సిద్దించగా, తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17 న రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు.
ఇది జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలు కొనసాగనుండగా, సెప్టెంబర్ 16 , 17 ,18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
16 వ తేదీన అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో 15 వేల మందితో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన మీదట, బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్యతను, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వక్తలు వివరిస్తారని అన్నారు.
17 వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం జరుగుతుందన్నారు.
పంద్రాగస్టు తరహాలోనే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం జరుపుకోవాలని సూచించారు.జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో తాను కలెక్టరేట్లో జరిగే జాతీయ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు.
అదే రోజున హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుండి సుమారు 3500 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులను ప్రత్యేక బస్సులలో తరలించేలా ఏర్పాట్లు చేశామని, వారికి అల్పాహారం, భోజన వసతి కూడా కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.
18 న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర విశిష్టతను, స్ఫూర్తిని చాటిచెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు.
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ చిత్రామిశ్రా, డీ ఆర్ డీ ఓ చందర్, డీ టీ సీ వెంకట రమణ, డీపీవో జయసుధ, డీ ఐ ఈ ఓ రఘురాజ్, డీ ఈ ఓ దుర్గాప్రసాద్, ఆర్ అండ్ బీ ఎస్.
ఈ రాజేశ్వర్ రెడ్డి, అదనపు డీ సీ పీ గిరిరాజ్, నిజామాబాద్ ఏ.
సీ.పీ వెంకటేశ్వర్, కలెక్టరేట్ ఏ.
ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!