ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District)ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల ఆర్య వైశ్య కుటుంబాల కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆలయంలో వాసవి మాతకు అభిషేకం, కళాశాల పూజ, నవగ్రహ పూజ నిర్వహించారు.అనంతరం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా భక్తులకు అల్పాహారం, అన్నదానం చేశారు.కార్యక్రమములో ఆర్యవైశ్య సంగం అధ్యక్షుడు చెపూరి రాజేశం( Chepuri Rajesh) తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, ఆర్య వైశ్య కుటుంబాల వారు పాల్గొన్నారు.

వీడియో వైరల్: రోడ్డుపై వెళ్తున్న మహిళపై దుండగుల దాడి..