ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా దసరా వేడుకలు.

శమీపూజ , ఆయుధపూజ వాహనపూజలు శ్రీ దుర్గా మాత కు ప్రత్యేక పూజలు ల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అధికసంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలు గ్రౌండ్ చుట్టూ కెసిఆర్.

కెటిఆర్, వినోద్ రావు ల బారీ ప్లేక్సిల ఏర్పాటు ఎన్నికల దృష్ట్యా ప్లేక్సిల తొలగించిన ప్లేయింగ్ స్కాడ్ టీం ఎల్లారెడ్డిపేట మండలం లో దసరా వేడుకలు( Dussehra Celebrations ) ఘనంగా జరిగాయి.

శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా పండుగ సందర్భంగా గ్రామ పురోహితులు సోమవారం ఆయా గ్రామాల్లోని వివిధ దేవాలయలాలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జమ్మిచెట్ల కు శమీపూజలు, వాహనాలకు వాహాన పూజలు చేశారు.

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్.

ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు, సాంప్రదాయం ప్రకారం హిందువులు నూతన వస్త్రాలు ధరించి సాయంత్రం దసరా రోజు శుభసూచకంగా భావించే పాలపిట్టను ప్రజలు దర్శనం చేసుకున్నారు, ప్రజలు ఆయాగ్రామాల్లోని దేవాలయాలకు వెళ్లి స్వామిలోరిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఎల్లారెడ్డిపేట ( Yellareddipeta )మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి దసరా ఉత్సవాలను ఎన్నడూ లేనివిధంగా అదిరిపోయే విధంగా వేడుకలను తన స్వంత డబ్బులతో ఘనంగా నిర్వహించారు , ప్రతి పండుగ ను గొప్పగా నిర్వహించి పత్యేకతను చాటుకుంటున్నాడు , గ్రౌండ్ చుట్టూ ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ రావు , సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , మాజీ సర్పంచ్ మమతా వెంకటరెడ్డి అతని అనుచరుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ పెక్సీలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పదకొండు మంది బౌన్సర్ లను చూసి పలువురు పలు రకాలుగా ముచ్చటించుకున్నారు.

గిట్టని కొందరు వ్యక్తులు ఎన్నికల కోడ్ పేరుతో ఎన్నికల అధికారులకు పిర్యాదు చేయగా అక్కడికి ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్ లు ఎన్నికల ప్లేయింగ్ స్కాడ్ టీం అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలను తొలగించి వేశారు.

హైదరాబాద్ కు చెందిన ఎల్ ఇ డి లైటింగ్ షో వారి రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో గ్రౌండ్ అందిరిపోయింది.

మహారాష్ట్ర కు చెందిన కళా బృందం డప్పు చప్పుల్ల ప్రదర్శనతో గ్రౌండ్ దద్దరిల్లింది.

ఆడా మగా తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లకు తలపాగలు పంపిణీ చేయించాడు.

కాగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి నిర్వహించిన దసరా ఉత్సవాలను ప్రతి ఒక్కరు ప్రశంసించారు.

గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని విజయాలు సిద్దించాలని గడి మైసమ్మ తో పాటు గ్రామ దేవతలను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ప్రార్థించారు.

ఈ సందర్భంగా గడి మైసమ్మ తో పాటు గ్రామ దేవతలకు మేకలను బలిచ్చి మొక్కలు చెల్లించుకోని పలువురికి విందు భోజనం ఇచ్చారు.

అనంతరం శ్రీ రుక్మి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ రథంపై ఏర్పాటు చేసి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ టెంకాయ గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా తోపులాట జరిగింది, మాజీ సర్పంచ్ మమతా వెంకటరెడ్డి , బిజెపి పార్టీ నాయకుడు సందుపట్ల లక్ష్మారెడ్డి మధ్య కొంత వాగ్వివాదం జరగడం, బౌన్సర్ ఓ వ్యక్తి ని తోయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంప్రదాయ బద్ధంగా గ్రామ పుర వీధుల్లో ఊరేగించి ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ప్రజల దర్శనం కోసం ఆపారు అక్కడ స్వామిలోరిని గ్రామ ప్రజా ప్రతినిధులు,ప్రముఖులు , కులం మతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ దర్శించుకుని ఆలయ పూజారి నవీన్ చారి అందజేసిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

అనంతరం జంబి ఆకును బంగారంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు పెట్టుకొని అలింగణం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah ) , ఆలయకమీటీ అధ్యక్షులు నంది కిషన్, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వివిధ పార్టీల నాయకులు, వార్డు సభ్యులు , ఆలయకమీటీ వారు, గ్రామంలోని అన్ని కులాల వారు అన్ని మతాల వారు పాల్గొన్నారు, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి , ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖర్జూరం తినేటప్పుడు మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తున్నారా..?