ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు…
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ యావత్ భారతదేశం గౌరవించే జాతీయ జెండా( National Flag )ను రూపొందించిన పింగళి వెంకయ్య( Pingali Venkayya ) ఒక తెలుగు వాడు కావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం అని అన్నారు.
ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి భావంతో మెలగాలని దేశభక్తి పెంపొందించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థినిలు పాఠశాల డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, పడాల సురేష్, ఎర్ర గంగానర్సయ్య ఉపాధ్యాయులు సునీల్ కుమార్ విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆ విషయం తెలిసుంటే బేబీ జాన్ లో నటించేదాన్ని కాదు.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!