ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండలం కందికట్కూరు గ్రామంలో చాకలి ఐలమ్మ ( Chakali Ilammam )వర్ధంతి వేడుకలు రజక సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పైడి రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ,చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి,వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత,సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ,ధెైర్యశాలి,ఆంధ్ర మహాసభ సభ్యురాలు.

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో 1895, సెప్టెంబరు 26న ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు నాలుగవ సంతానం చాకలి ఐలమ్మ వీరిది వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే కుటుంబ జీవనాధారం.

పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు బాల్య వివాహం జరిగింది.వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె.

1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టి, అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.

దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుయాయులతో వెనుకబడిన కులాల మీద విరుచుకుపడేవి.

ఈ భూమినాది,పండించిన పంటనాది, నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.

అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.

ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి, ఉపాధ్యక్షులు అనిల్,ప్రధాన కార్యదర్శి లచ్చయ్య, కోశాధికారి శ్రీనివాస్,శ్రీనివాస్, పరుశరాములు,అంజయ్య, నరేష్,రవి,రాజ్ కుమార్,పోచయ్య, మహేష్,నాగరాజు,భూమయ్య, భీమయ్య,బాలయ్య.

తదితరులు పాల్గొన్నారు.

తన సినిమాతో రజినీకాంత్ ను బీట్ చేసిన గోపీచంద్…